పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

119


ఆమె నిత్యయౌవన గాన కొన్నాళ్లకు మఱియొకనిఁ బ్రేమించితీరెడిదే అనుకొనక తప్పదు! నిన్నటివఱకు నామెతో మాయావేషమున విహరించిన గంధర్వుఁడు రత్నమువంటి బిడ్డ పుట్టిన తరువాత వానినిఁ జేరదీయఁ డనియు, వరూధినిపైనితనవలపులవిసరును-నం దామె చిక్కుపడుటను దెలిపియుండఁ డనియుc దలఁచుట సరికాదు.

నే నిట్లందును, వరూధిని యా గంధర్వుని ముం దెన్న డెఱుగనిది గాదు. ఇట్టి వారి నెందఱినో యింతకుముందు బుట్టను బెట్టినదే! గంధర్వుఁడుకూడ నిట్టి కుచోద్యము లెన్నియో చేసి యెందఱినో దక్కఁగొనినవాఁడే ఇట్టి వారికి సంబంధించి యుండును గనుకనే యాలంకారికులు కొందఱు వేశ్య సామాన్యవనిత యనియు, నామెకు సంబంధించిన శృంగారము రసాభాసమే కాని శృంగారము కా దనియు నందురు. అది కా దని వేశ్యలను విడనాడిన శృంగారరసమునకుఁ బరిపోషమే కలుగ దనియు, వారు శృంగారసర్వస్వ మనియు మఱికొంద ఱాలంకారికులు దానిని ప్రతిఘటింతురు.

గంధర్వుఁడు మాయాప్రవరుఁడుగా మాయమైనను వరూధిని నంటిపట్టి యున్నాఁ డనియు, నామె ప్రసవించి, స్వరోచి కొన్నినెలలో యేండ్లో పెరిగిన తరువాత ప్రవరునిరాక కెదురు చూచిచూచి చీకాకుపడు స్థితికి వరూధినిని రప్పించి, తన పంతమును చెలికత్తెలకుఁ జెప్పి, వరూధినికిఁ జెప్పించి, ప్రవరునిపై సన్నగఁ దాను జెప్పి, ఛీ ! ఛీ ! పో నాతోఁ గూడిన వాఁడు నిజప్రవరుఁడే యని యామె తిరస్కరింపఁగా తిరస్కరింపఁగా, తాను మాయావేషమునఁ గలసి యున్ననాళ్లలోనే ముందు జాగ్రత్తపఱచి వ్రాసి యుంచుకొనినయేకాంత రహస్యముల డైరీని వెల్లడించి, వీలగుచో నసలు ప్రవరుఁడే యబద్ధ మనియు నదియంతయుఁ దనవేషమే ననియుఁ జెప్పి తమ పరస్పర ప్రేమసాక్ష్య మయినకుమారుని స్వరోచిని గౌగలించుకొని (ఆ కుమారుడును శృంగారలోలుఁడై గంధర్వునిసంతానమే సుమా