పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

మీఁగడ తఱకలు


యనిపించుకొనినాఁడుగాని ప్రవరుని బిడ్డఁ డనిపించు కొనలేదు.) వరూధిని నబ్బురపుచ్చి, తన నేర్మిని మెప్పించి ద్విగుణీకృత ప్రేమతో మరల వరూధినీసన్మానమున వర్తిల్లినాఁ డనుకొననిచో వరూధినీప్రవరకథ రసాభాసాత్మకమై రోఁతగొల్పును.

పెద్దనగా రీసందర్భము నీవిధముగ నిర్వహింపకపోయినను సూచనగానైన నిట్టితీరున దెల్ఫియుండవచ్చును. తెల్పక పోయినను మన మట్టి కథను గట్టుకొనుట కవకాశ మేనిఁ గల్పించియుండవచ్చును.

కాని, మాయమై పోవుసమయమున మాయాప్రవరుని తలపుల నీవిధముగఁ దానే విప్పి చెప్పి తంటా తెచ్చినాఁడు!

క|| అంత వియచ్చరు డభిమత
     మంతయు సమకూఱుటయును నచ్చర గర్భ
     శ్రాంత యగుటయును గనుఁగొని
     యింతట నిచ్చోటు వదల కే నిఁక నున్నన్

క|| వంచన యెఱిగిన మఱి శపి
     యించునొ సురకాంత చెప్ప కేఁగినఁ బ్రేమం
     బంచ శరశరపరంపరఁ
     బంచత ప్రాపించి మీఁదఁ బాపం బిడునో.

వ. అని వితర్కించి యక్కపటవిప్రుం డెఱింగించి యనిపించుకొనియ పోవువాఁడై. - మనుచరిత్ర

ఏవేవో ప్రలాపించినాడు. ఆ యనిన వన్నియు వట్టి యబద్ధములే అబద్ధములే కాక మోసపునీతివాదములుకూడ! అమరుఁడైనగంధర్వుఁ డమరకాంత యైనవరూధినికిఁ 'బంచత' ప్రాపించునేమో యనుకొనుట విరుద్ధము. (వియచ్చరుఁ డని వాక్యమునఁ గర్తృపద ముండగా మరల "కపటవిప్రుఁ డనుట' యనన్వితముగనున్నది.)

ఈ విధమున ప్రవరవేషధారి యయినగంధర్వుని యంతరంగపు దలఁపులను వెల్లడించుట శ్రోతల హృదయములలో నిష్పన్నమయ్యెడి శృంగారరసమును జెఱుచుట యనిపించినది.