పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

105


..........యస్మా దస్త్రే మదా దఖిలమనుపతిం దేచయామాత్యవర్య
స్సో౽ యం శ్రీచంద్రమౌళి ర్జయతి గురువరః ప్రోలనారాధ్యవంశ్యః
సచాయం దేచయామాత్యో మాహిమస్తవపంచకామ్
లక్ష్మీధరకటాక్షేణ కురుతే గురు తేజసా. "

(ఈగురునిఁగూర్చి యుద్భటారాధ్య చరిత్రమునవతరణికను గ్రంథావసానమును గూడఁ జూచునది.)

దేచమంత్రి గోపమంత్రిచే నగ్రహారాది సమ్మానముcబడసి ప్రఖ్యాతుఁ డయినపిదపనే యుద్భటచరిత్రము కృతి నంది యుండును. ఆకాల మించుమించుగా క్రీ.1525 అని తలఁప వచ్చును. దీనిచేఁ దెనాలి రామలింగకవి కృష్ణదేవరాయలసభలో నున్నాఁడన్నలోకప్రతీతి సదాధార మయి సంరక్షిత మగుచున్నది.

[1]పాండురంగమాహాత్మ్య రచనాకాలము

పాండురంగమాహాత్మ్యము విరూరి వేదాద్రిమంత్రి కంకిత మయినది. ఆవేదాద్రిమంత్రి కందాళ యుప్పలాచార్యుల శిష్యుఁడు. మంగయ గురువరాజు కుమారుఁ డగుపెదసంగ భూపాలునొద్ద వ్రాయసకాcడు. చిత్రభారతకృతిపతితండ్రి పెద్దతండ్రులును, వైజయంతీ విలాసకర్తయగు సారంగుతమ్మకవియు నీ కందాళ యప్పలాచార్యులకు శిష్యులు. క్రీ. 1542 పరాభవవత్సరమున గండికోట ప్రభువు కందాళప్పలాచార్యులకు భూదాన మొసగినశాసనము గలదఁట. దీనిఁబట్టి పాండురంగమాహాత్మ్య రచనాకాల మించుమించుగా క్రీ. 1550, 1560 అగునని తలంప వచ్చును. మఱియుఁ బాండురంగమాహాత్మ్యమున రామకృషునిచే

  1. శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు 'తెనాలికవులు' అను పేర 1914 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో వ్రాసినవ్యాసమునఁ బాండురంగమాహాత్మ్యరచనా కాలమును జక్కఁగా నిర్ణయించినారు. దానిసారమే యిక్కడఁ జూపఁబడినది.