పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

మీఁగడ తఱకలు


భట్టరు చిక్కాచార్యుఁడు

తన గురుఁడుగా స్తుతింపఁబడినాఁడు. ఈచిక్కాచార్యునికిఁ బలువు రాంధ్రకవులు శిష్యులయి యుండిరి. చాతుర్వాటికామాహాత్మ్యము, ఆనందకాననమాహాత్మ్యము మొదలగు ప్రబంధములను రచియించిన లింగమకుంట రామకవి (ఈతఁడు తెనాలి రామకృష్ణకవి యల్లుఁడు) యు నాతనితమ్ముఁ డగులింగమకుంట తిమ్మకవియు నీ చిక్కాచార్యులకు శిష్యులు

క|| గురురాయపట్టభద్రుని
     నరిహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
     ట్టరు చిక్కాచార్యుల మ
     ద్గురులఁ దలఁచి యడుగులకు నతుల్ గావింతున్
                                     -లింగమకుంట రామకవి.

సీ|| శ్రీవైష్ణవహితుండ జిక్కయభట్టరు
                         శిష్యుండ. - లింగమకుంట తిమ్మకవి[1].

మఱియు రామకృష్ణకవులచేఁ గామందకము కృతిగొన్న వాcడు కొండ్రాజు తిమ్మరాజుకొడు కగు వేంకటాద్రియు నీయాచార్యుని శిష్యుఁడే,

క|| శ్రీచంచద్బట్టరుచి
     క్కాచార్యవరార్యశిష్య యతులితశౌర్య
     ప్రాచుర్యవర్య గుణర
     త్నాచల జయలలిత ధైర్యనయతత్త్వనిధీ.
                          (కామందకము కృతిపతి సంబోధనమున)

మఱియు నీకామందక కృతిపతి, పాండురంగమాహాత్మ్య కృతిపతి యగువిరూరివేదాద్రిమంత్రి నేలినప్రభు వైన పెదసంగభూపాలునకుఁ జెల్లెల కొడుకు. శా.1505, క్రీ. 1584 స్వభానువత్సరమున వేంకటరామకృష్ణ కవులచే నా కొండ్రాజు తిమ్మరాజు కొడుకగువెంకటాద్రి కామందకకృతి నందుకొన్నాఁడు.

  1. సులక్షణసారకర్త (లింగమకుంట తిమ్మకవి) అప్పకవికంటెఁ దర్వాతివాఁ డని కం.వీ.గారు వ్రాయుట ప్రామాదికము.