పుట:Matamu-Pathamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. జ్ఞాన విషయము తెలుసుకొంటే ప్రతి ఒక్కరు నేను ఇందువు కావలెనని ఆత్రుత పడులాగున చేయునది ఇందూ జ్ఞానవేదిక.

12. మాయ (సాతాన్‌) లేక సైతాన్‌ను మరియు దేవుడు అను ఇద్దరిని మాత్రమే తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

13. భగవద్గీత, ఖుర్‌ఆన్‌, బైబిల్‌ యొక్క సారాంశము తెలిసి ఆచరించునది ఇందూ జ్ఞానవేదిక.

14. దేవున్ని తప్ప ఇతర మాయను ఆరాధించవద్దని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

15. దేవుని జ్ఞానము అర్థము కాకపోవడమే భూమిమీద అన్ని అనర్థములకు కారణమని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

16. హింసతో ఏ మతమునూ, ఏ మనిషినీ మార్చలేమనీ, దేవుని జ్ఞానముతో ఎవరినైనా మార్చవచ్చనీ తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

17. జ్ఞానము తెలిసేంతవరకు ఏ మతమునకు సంబంధించినదో ఎవరికీ అర్థముకానిది ఇందూ జ్ఞానవేదిక.

18.అణగారిపోయిన ఆచారములకు, సాంప్రదాయములకు అర్థములను తెలియజేయునది ఇందూ జ్ఞానవేదిక.

19. భగవద్గీత శ్లోకాలకు, పరిశుద్ధ గ్రంథము యొక్క వాక్యములకు, పవిత్ర గ్రంథము యొక్క సూత్రములకు సారాంశమైన దేవున్ని మాత్రము తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

20.దేవుని జ్ఞానమను ఆయుధముతో దేవుని సైనికునిగా మారి ప్రక్కదారి పట్టిస్తున్న మాయ లేక సాతాన్‌ మీద పవిత్ర యుద్ధము చేయాలి కానీ సాటి మనుషుల మీద కాదని తెలియజేయునది ఇందూ జ్ఞానవేదిక.