Jump to content

పుట:Matamu-Pathamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రైత సిద్ధాంతమును తెల్పు

ఇందూ జ్ఞానవేదిక బోధలు చదవండి !!!

1. విశ్వవ్యాప్తముగా అందరిలో ఉన్నది ‘‘త్రైతము’’ అని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

2. విశ్వవ్యాప్తిగనున్న అన్ని మతములలో ఇందూమతము కలదని చెప్పునది ఇందూ జ్ఞానవేదిక.

3. ఏ మతములోని వారికైనా మత సామరస్యము కలగాలంటే దేవుని జ్ఞానము తెలియాలంటున్నది ఇందూ జ్ఞానవేదిక.

4. అన్ని మతములను సామరస్యముగా బోధించునది ఇందూ జ్ఞానవేదిక.

5. అన్ని మతముల సారాంశము కల్గియున్నది ఇందూ జ్ఞానవేదిక.

6. మంత్రములు, జపములు, ఉపవాసములు, ధ్యానములతో సంబంధము లేకుండ ఇంద్రియాతీత జ్ఞానమును బోధించునది ఇందూజ్ఞానవేదిక.

7. నీవు నీ మతములో స్వచ్ఛమైన జ్ఞానివి కావాలని కోరుకునేది ఇందూ జ్ఞానవేదిక.

8. మనుజుల మతాలకతీతమైన జ్ఞానమును తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

9. జీవునికంటే పెద్దది మరియు దేవునికంటే చిన్నది మరొకటి గలదు. అదేదో తెలుపునది ఇందూ జ్ఞానవేదిక.

10. హిందూ మతముకంటే అతీతమైన ఇందూమతమును గురించి చెప్పి అన్ని మతములవారిచేత నేను ఇందువునని (జ్ఞానినని) చెప్పించునది ఇందూ జ్ఞానవేదిక.