పుట:Matamu-Pathamu.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నో కేసులను పెండింగులో పెట్టు పోలీసులు మావారిని కోర్టుకు తీసుకపోవడము వలన ఇది మా మతమని మేము చెప్పుకోవడానికి కూడ మాకు సిగ్గుగాయున్నది. ఒక కేసును ఎంతో విచారణ జరిపి తొమ్మిదిమంది సాక్షులు సాక్షము చెప్పినప్పటికీ పదవసాక్షి కొంత సరిగా చెప్పలేదను చిన్నసాకుతో, కేసును కొట్టివేయు న్యాయాధిపతులు విచారణ జరుపకుండ, ముద్దాయిలుగా నిలబెట్టిన వారి సమాధానమేమో చూడకుండ, పెద్దకేసుకు శిక్ష చెప్పినట్లు చెప్పడము ఇతర మతముల ముందర హిందూమతము తలదించుకొనే పనికాదా! దీనినంతటిని చూస్తే హిందూమతము క్షీణించిపోక అభివృద్ధి ఎలా అవుతుంది?

ఏ మతములోనైన దేవునిజ్ఞానము, దేవుని విూద విశ్వాసము లేకపోతే అది క్షీణించక అభివృద్ధి కాదు. నేడు దేవుని జ్ఞానముగానీ, దేవుని విూద విశ్వాసముగానీ హిందూమతములో లేకుండ పోయినది. అందువలన హిందూమతము క్షీణదశలో ఉండి క్రైస్తవ, ఇస్లామ్‌ మతములు అభివృద్ధి చెందుచున్నవి. హిందూమతము అభివృద్ధి చెందాలంటే మా సలహా ఏమనగా! మతము అను పదము పథము అను పదముగా మార్చుకోవాలి. అట్లే హిందూ అను పదమును ఇందూ అను పదముగా మార్చుకోవాలి. దేవునికి దగ్గరగా పోవాలంటే ఏ మతమైనా మతము అను మాటను వదిలి పథము అను మాటగా మార్చుకోవాలి. అపుడు మాయలేని స్వచ్ఛమైన జ్ఞానము అందరిలోను నిలువగలదు. మేము చెప్పునది దేవుని జ్ఞానమార్గము కావున అసూయలేకుండ స్వాములు సహితము ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటారని తలచుచున్నాము. మేము మతములో లేము పథములో ఉన్నామని అందరు పథమును అనుసరించాలి.