పుట:Matamu-Pathamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మమ్ములను అడుగుచున్నారు. ఎంతో జ్ఞానమున్న విూరు మా మతములోనికి రండి మిమ్ములను మేము ఎంతో గౌరవిస్తాము. విూ మాటవినేవారు విూ సంఘములోని వారు దాదాపు పదివేలమందియున్నారు కదా! విూరందరు మా మతములోనికి వస్తే మిమ్ములను చాలాగొప్పగ పెట్టుకొంటాము. విూ మతములోలేని గౌరవము గుర్తింపు మేము మా మతములో ఇస్తామంటున్నారు. మరియొక మతము వారు వచ్చి మా మతములో దేవునికిగానీ దేవుడు చెప్పిన మాటలనుగానీ ఎవరైనా అగౌరవముగా మాట్లాడితే వాడు ప్రధానమంత్రి అయిన వదలక చంపి తీరుతామనీ, దేవునికి వ్యతిరేఖమైన చిన్న సమస్యకు కూడ మా మతములోని వారంత ఏకతాటి విూదకు వస్తారనీ, దేవుని విూద ఎక్కువ విశ్వాసమున్న మా మతములో మీరు చేరండని పిలుస్తున్నారు.

వారు మా విూద అభిమానముతో అలా పిలువడము సంతోషమే. కానీ మాకు మతము ముఖ్యముకాదు. పథము ముఖ్యము కావున ఎవరి మాటను నేను వినదలచుకోలేదు. మతము మధ్యలో వచ్చినదని దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకవేళ హిందువులు మాపట్ల వ్యవహరించిన తీరుకు, మేము ఇతర మతములో చేరుటకు అంగీకరించియుంటే నాతోపాటు పదివేలమంది నన్ను అనుసరించి ఇతర మతములోనికి వచ్చేవారుకదా! అపుడు హిందూమతము హిందూరక్షణ సంస్థలచేత రక్షించబడినదా? భక్షించబడినదా? చదువుచున్న మీరే యోచించి చెప్పండి. హిందువులు మా మతము క్షీణించిపోతున్నది, దానిని రక్షించుకోవాలని గుంపులుగా సంస్థలుగా ఏర్పడడము మంచిదేకానీ వారిలో దైవజ్ఞానము లేకపోవడము వలన దేనినైతే రక్షించాలనుకొన్నారో దానినే భక్షించినట్లయినది. దేవుని గుడి విూద దేవుని వాక్యముండడము మంచిదేనని హిందూపరిషత్‌ వారు అనుకోకుండ పోవడము మతభక్షణ కాక, మత రక్షణ ఎలా అవుతుంది? ముద్దాయిలు దొరకలేదని