పుట:Matamu-Pathamu.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంటిలోని తల్లిదండ్రులు వ్యతిరేకమైపోయి జ్ఞానము తెలుసుకోవాలనుకుంటే ఇంటిలోనికి రావద్దు. మాతో సంబంధము పెట్టుకోవద్దు అనే వాళ్ళుకూడ కలరు. భార్య దైవజ్ఞానము తెలుసుకొంటే సరిపోని భర్తలున్నారు. అంతేకాదు భర్త జ్ఞానము తెలుసుకొనుటకు ప్రయత్నిస్తే విడాకులిస్తామనే భార్యలున్నారు. కొడుకు భగవద్గీతను దాచిపెట్టుకొని దొంగగా చదువుతూవుంటే చూచిన తండ్రి భగవద్గీతను అగ్గిపుల్లతో అంటించి కాల్చివేశాడు. ఇదీ హిందూ మతములో భగవద్గీతకూ అందులోని జ్ఞానమునకూ ఉన్నవిలువ!

హిందూమతములోని పరిస్థితిని ప్రక్కనుండి గమనిస్తున్న క్రైస్తవులు వారి మతప్రచారమే ముఖ్యమైన ఘట్టముగా పెట్టుకొన్నవారై జ్ఞానము తెలియని హిందువులను మాటలగారడీతో వారి మతములోనికి సులభముగా చేర్చుకొంటున్నారు. హిందూమతములో ఏమాత్రము జ్ఞానము తెలియనివారు, భగవద్గీత పేరు కూడ విననివారు, తాము ఏ మతములో ఉన్నామోనని కూడ తెలియనివారు, క్రైస్తవమతములోనికి సులభముగా చేరిపోయి మేము క్రైస్తవులము అంటున్నారు. అంతవరకు తాము హిందువులమని కూడ వారికి తెలియదు కావున క్రైస్తవులమని చెప్పుకొవడముతో ఏదో డిగ్రీ పొందినంత సంతోషము పొందుచున్నారు. ఈ విధముగా హిందూ మతములోని వారు క్రైస్తవమతములోనికి చేరిపోతూవుంటే, కొందరు హిందూమతాభిమానులు మా మతము పతనమైపోతున్నది, క్రైస్తవమతము అభివృద్ది అగుచున్నదని బాధ పడుచున్నారు. అలా వాపోవువారందరు కొన్ని గుంపులుగా తయారై హిందూమత రక్షణ సమితియనీ, హిందూ మత ఉద్ధరణకమిటియనీ, హిందూపరిషత్‌యనీ అనేకరక సంస్థలుగా ఏర్పడి మతమార్పిడి జరగకుండా చూచుకోవాలనుకొన్నారు. సమస్య జ్ఞానము వలన పరిష్కారమవుతుందని