పుట:Matamu-Pathamu.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియదు. భగవద్గీతను గురించి విని కూడ దానిని చూడనివారు 10 శాతము గలరు. భగవద్గీతను చదవకుండ చూచినవారు నూటికి 5 మంది గలరు. గీతను పూర్తి చదివినవారు నూటికి 5 మందే గలరు.

భగవద్గీతను ఏమాత్రము తెలియనివారు నూటికి 80 మంది హిందువులు గలరు.

భగవద్గీతను గురించి వినికూడ దానిని చూడనివారు నూటికి 10 మంది హిందువులు గలరు.

భగవద్గీతను చూచి కూడ దానిని చదవనివారు నూటికి 5 మంది హిందువులు కలరు.

భగవద్గీతను చూచి దానిని శ్రద్ధగ చదివినవారు నూటికి 5 మంది హిందువులు కలరు.

హిందూమతములో తప్ప ఏ మతములోని వారికైన వారి మత గ్రంథమును గురించి పూర్తి తెలిసియుండును. మతగ్రంథమును చూడనివారు ఎవరూ ఉండరు. చదువురాని వారు చదవలేక పోవచ్చును. కానీ పవిత్రముగ చూచుచుందురు. కేవలము ఒక్క హిందూమతములోనే భగవద్గీతను తెలియనివారు, చూడనివారు, చదువువచ్చి చదవనివారు కలరు. కొన్ని పల్లెలలోనికి పోయి చూస్తే ఊరు మొత్తము భగవద్గీత అంటే ఏమిటో తెలియనివారు కూడ కలరు. మండల స్థాయిలో, జిల్లాస్థాయిలో మరియు పట్టణములో మాత్రము గీతను గురించి తెలిసినవారు కొందరు కలరు. ఇపుడు ప్రస్తుతకాలములో యువతీయువకులుగానున్న వారిని చూస్తే కొంతకాలము చదువులు తర్వాత ఉద్యోగములు తప్ప గీతను గురించి ఏమాత్రము తెలియని స్థితిలో ఉన్నారు. యాబైయేళ్ళు వయస్సున్నవారిని కదిలించి భగవద్గీతను గురించి చెప్పితే మాకు ఈ వయస్సులో ఎందుకు? పూర్తి ముసలివాళ్ళమై ఏ పని చేయలేనపుడు తీరిగ్గా చదువుకోవచ్చును, ఇపుడు దానితో ఏమి పనియుంది అంటున్నారు. ఎవరైన చిన్న వయస్సులోని వారు 15 నుండి 20 సంవత్సరముల వయస్సున్నవారు గీతను గురించి, అందులోని జ్ఞానమును