పుట:Matamu-Pathamu.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియక పోవడము వలన, ఈ గుంపులలో జ్ఞానము తెలిసినవారు లేకపోవడము వలన క్రైస్తవబోధకులకు వారి మతమును గురించి హిందువులలో ప్రచారము చేయకూడదని చెప్పారు. క్రైస్తవబోధకుల ముఖ్యమైన పని మత ప్రచారమే కావున వారు, వీరి మాటను ఖాతరు చేయకుండ బోధలు చెప్పడము, వీరు వారి విూద భౌతికముగా దాడి చేయడము జరుగుచున్నది. అయినా ప్రయోజనములేదు. వారు ఎలాగో ఒకలాగున బోధలు చెప్పుచూనే ఉన్నారు. ఈ మధ్యన హిందువులలో ఎన్ని పరిషత్‌లు ఏర్పడినా క్రైస్తవులు ప్రత్యేక టీ.వి ఛానళ్ళు పెట్టి వారి బోధలను ప్రచారము చేస్తూనేయున్నారు.

ఇల్లు అంటుకొన్నపుడు దానిని ఆర్పేదానికి నీరును ఉపయోగించాలి. అట్లుకాక నీటివలెనున్న నూనెను నీరేలేనని ఉపయోగిస్తే మంట మరింత మండుతుంది, కానీ నూనె వలన ఆరిపోదు. అదే విధముగా మత మార్పిడి సమస్యను అధిగమించడానికి జ్ఞానాన్ని ఉపయోగిస్తే సమస్య తీరిపోతుంది, కానీ బలమునుపయోగిస్తే సమస్య అణిగిపోదు, మరింత జటిలమౌతుంది. మతమార్పిడి సమస్య పరిష్కారము కావడానికి భౌతిక దాడులు పనికిరావు. అభౌతికమును తెలుపు జ్ఞానము కావాలి. అటువంటి జ్ఞానము హిందువులలో కనిపించడములేదు. దైవజ్ఞానముగానీ, ఆత్మజ్ఞానము గానీ ఆవగింజంత కూడలేని హిందువులగుంపుల వలన హిందూమతమునకే నష్టము ఏర్పడుచున్నది. గ్రుడ్డివాడు దొంగను కొట్టాలని కట్టెను తీసుకొని తన ఇంటిలోని కుండలనే పగులకొట్టుకున్నట్లు, అజ్ఞాన గ్రుడ్డితనముగల హిందూసంస్థలు తమ మతాన్ని ఉద్ధరించేది పోయి, తమ మతాన్ని తామే దిగజారిపోవునట్లు చేయుచున్నవి. ఈ మాటను మేమంటే కొందరికి కోపమొచ్చునేమో కానీ మేము చెప్పబోవు యదార్థ సంఘటనను చదివిన తర్వాత విూలో ఏమనిపిస్తుందో విూరే చూచుకోండి! జరిగిన ఈ సంఘటన