పుట:Matamu-Pathamu.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పినవాడు ఆత్మే కావున గీతలోని సత్యమేమో ఆయనకే తెలుసు. కావున ఆయనే హిందువులలో ఎంత జ్ఞానమున్నది చెప్పాడు.

ఇంకా మేము చెప్పునదేమనగా, 93 శాతము దైవజ్ఞానమున్న భగవద్గీతను 3 శాతము అర్థము చేసుకొన్న మనుషులు దానిని ఎంతవరకు గౌరవిస్తున్నారు అని చూచుకొందాము. ఇతర మతములతో పోల్చి చూస్తే ఇస్లామ్‌మతములో ఖురాన్‌ ఎంతో గౌరవించబడుతూ ఉన్నది. దేవునితో సమాన విలువనిస్తూ దానిని ఎంతో పవిత్రముగ చూచుకొంటుంటారు. దానిని క్రింద పెట్టుటకు కూడ వారి మనస్సు ఒప్పదు. దానికి ఉన్నత స్థానమును కల్పించియుందురు. ఇస్లామ్‌మతములో ఐదు సంవత్సరముల వయస్సున్న పిల్లవానికి కూడ ఖురాన్‌ అంటే ఏమిటో తెలుసు. ముస్లీమ్‌లు ఐదు సంవత్సరముల పిల్లవాడిని కూడ దైవప్రార్థన కొరకు మసీద్‌కు తీసుకపోయి ఖురాన్‌ను గురించి అవగాహన కొచ్చునట్లు చేయుచుందురు. యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి కాకముందే ఖురాన్‌ను చదవడము నేర్పించి ప్రతిదినము ఖురాన్‌ను చదివేటట్లు అలవాటు చేయుచున్నారు. ముఖ్యముగ చెప్పాలంటే ఇస్లామ్‌ మతములో ఉన్నవారు ఎక్కువ శాతము ఖురాన్‌ను తమ ప్రాణముకంటే ఎక్కువగా చూచుకొంటున్నారు. వారిలో ఎంత పెద్ద ఉద్యోగి అయినా, దేశానికి రాజయినా వారి గ్రంథమును, వారి దేవుని జ్ఞానమును అనుసరించే నడుచుకొనుచుందురు. ఇస్లామ్‌దేశములలో దేవునికి వ్యతిరేఖమైన చట్టముగానీ, రాజ్యాంగముగానీ ఉండదు.

ఇక హిందూదేశములోనున్న హిందువులలో దేవుడూ, దేవుడు చెప్పిన భగవద్గీత యొక్క విలువ ఎట్లున్నదో వివరించుకొందాము. హిందూ దేశములోని హిందువులకు నూటికి ఎనభైమందికి భగవద్గీత అంటే ఏమిటో