పుట:Matamu-Pathamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధించిన జ్ఞానము భగద్గీతలో కలదు. కావున గీతను మతగ్రంథమనుట పొరపాటనియే చెప్పవచ్చును. భగవద్గీతలో 93 శాతము దైవజ్ఞానము ఇమిడియుండగా హిందువులుగా ఉన్నవారు సగటుకు గీతలోని జ్ఞానమును కేవలము 3 శాతము కూడ తెలుసుకోలేదు. భగవద్గీత మా మతగ్రంథమని చెప్పుకొను హిందువులకే దానిలో భావము 3 శాతము కూడ అర్థము కానపుడు, దానిని ఏమాత్రము చదవని ఇతర మతములవారికి దానిలోని జ్ఞానము ఎలా తెలియును? దాదాపు 5200 సంవత్సరములనుండి ఉన్న భగవద్గీత హిందువులకు ఇంతవరకు అర్థము కాలేదని చెప్పవచ్చును. ఇక్కడ కొందరికొక ప్రశ్నవచ్చి భగవద్గీత భావము సామాన్య మనుషులకు తెలియకుండ పోయియుండవచ్చును. కానీ స్వావిూజీలకు పీఠాధిపతులకు కూడ తెలియదంటారా? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! స్వావిూజీలు వ్రాసిన గీత వివరమునే కదా సామాన్య మనుషులు చదువుతున్నది. దేవుడు చెప్పినదొకటైతే వ్రాసినవారు చెప్పిన భావమొకటున్నపుడు, వ్రాసినవారికి అర్థముకాకనే అలా వ్రాశారని చెప్పాలి. స్వావిూజీలకే అర్థముకానపుడు సామాన్యులకు ఎలా అర్థమవుతుంది? అందువలన గీతలో 93 శాతము జ్ఞానమున్నా దానిని మనుషులు గ్రహించినది 3 శాతమేనని అంటున్నాము. ఇపుడు అనుమానము వచ్చి ఎవరికి తెలియనిది నీకెలా తెలుసు? ఇంతవరకు చెప్పిన వారికంటే నీవు బాగా తెలిసినవాడివా? అని కూడ కొందరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి జవాబుగా చెప్పునదేమంటే నేను అందరికంటే తక్కువ తెలిసినవాడినేనని ఒప్పుకుంటున్నాను. ఒక మనిషిగా ఈ వ్రాతకు నాకు ఎటువంటి సంబంధములేదు. నేను కేవలము కలములాంటివాడినే. ఈ వ్రాతను వ్రాయించినవాడు, ఉన్న సత్యమును చెప్పువాడు నా ప్రక్కనున్నవాడు (ఆత్మ) అని చెప్పుచున్నాను. ఆనాడు గీతను