పుట:Matamu-Pathamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మించి, దేవుని బోధనే బోధించునట్లు భ్రమింపచేసి, చివరకు దేవుని మాటకు వ్యతిరేఖముగా వారి నోటనే తన మాటను పలికించుచున్నది. దేవుని జ్ఞానమును బోధించు బోధకులైన కొందరిని మాయ తండ్రి అని పేరు పెట్టి పిలుచునట్లు చేసినది. బోధకుల చేతనే నేను ఫాదర్‌(తండ్రి)ని అని చెప్పించుచున్నది. కొందరి బోధకులకు హోదాగా ఫాదర్‌ (తండ్రి) అను పేరును కల్గించి సమాజములో గౌరవ మర్యాదలు కలుగజేయుచున్నది.

నేడు క్రైస్తవమతములో బోధకులైన ఫాదర్‌లు ఎందరో గలరు. వారు బైబిలులోని విషయములనే చెప్పుచున్నప్పటికి తాము మత్తయి 23, 9వ వచనములోనున్న దేవుని వాక్కుకు వ్యతిరేఖముగా ఫాదర్‌ అని ఇతరుల చేత పిలిపించుకొంటున్నాము కదా! అను ధ్యాస వారిలో ఏమాత్రము లేదు. ఫాదర్‌ పేరుతో బోధకులకు కొంత హోదాను కల్పించిన మాయ మేము దేవుని సేవకులమని భ్రమింపచేసి, ఆ భ్రమలో తాము దేవుని మాటకు వ్యతిరేఖముగా ఉన్నాము కదా అను జ్ఞప్తిని లేకుండ చేసినది. చూచారా మాయ ఎంత బలమైనదో! దేవుని విూద దాదాపు యాబైశాతము విశ్వాసమున్న క్రైస్తవులలోనే మాయ ఇంత బలముగా ఉంటే, కేవలము రెండు శాతము విశ్వాసమున్న హిందువులలో మాయ ఎంత భయంకరముగా ఉండునో ఊహించుకోండి. మాయకు ఎక్కువ పట్టువున్న మతము హిందూమతమే. ఎందుకనగా హిందూమతములో దేవుని విూద విశ్వాసము రెండు శాతమే ఉన్నది, కనుక మిగత 98 శాతము మాయకు బలముగా ఉన్నది. సగటు హిందూమతము విూద చెప్పునది 98 శాతమని తెలియవలెను. విడదీసి చెప్పుకొంటే ఒక మనిషిలో 90 శాతము దేవుని విూద విశ్వాసముండవచ్చును. అపుడు వానిలో మాయ కేవలము 10 శాతము మాత్రము పని చేయుచున్నదని చెప్పవచ్చును. అలాగే ఒకనిలో 100 శాతము దేవుని విూద విశ్వాసము