పుట:Matamu-Pathamu.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లేకుండవచ్చును. అటువంటి వానిలో 100 శాతము మాయ పని చేయుచున్నదని తెలియుచున్నది. ఈ విధముగా లెక్కించి చూస్తే హిందూమతములో కూడ కొందరు అక్కడక్కడ బహు అరుదుగా దేవునివిూద విశ్వాసమున్న వారు ఉండవచ్చును. ప్రస్తుతము హిందూమతములోనున్న పరిస్థితిని బట్టి, జ్ఞానులను అజ్ఞానులను అందరిని దృష్ఠిలో పెట్టుకొని సగటుకు మాయ ఎక్కువ 98 శాతము హిందూమతములో బలము కలిగియున్నదని చెప్పవచ్చును. అన్నిటికంటే వెనుక దాదాపు 1400 సంవత్సరముల క్రితము పుట్టిన ఇస్లామ్‌మతములో మాయ కేవలము 10 శాతము బలము కలిగియుండగా, దానికంటే 600 సంవత్సరముల ముందు పుట్టిన క్రైస్తవమతములో 50 శాతము బలము కలిగియున్నది. మాయ 98 శాతము హిందూమతములో ఉన్నదను మా మాట హిందువులైన కొందరికి మ్రింగుడుపడని విషయము. కానీ ఈ గ్రంథమును చివరివరకు చదివితే నేను చెప్పిన మాటను విూరు కూడ చెప్పగలరు.

ఇంతవరకు మనుషులలోగల మతములందు గల మాయను విశ్లేషించి చెప్పుకొన్నాము. ఇపుడు చెప్పునదేమంటే హిందూ మతగ్రంథమైన భగవద్గీతలో జ్ఞానము ఎంతమేరకున్నది అను విషయమును గురించి చెప్పుకొందాము. భగవద్గీత 700 శ్లోకముల గ్రంథము. అందులో 54 శ్లోకములు మాయకు సంబంధించిన కల్పిత శ్లోకములు గలవు. దీనినిబట్టి దాదాపు 93 శాతము దైవజ్ఞానము, 7 శాతము మాయజ్ఞానము భగవద్గీతలో కలదని చెప్పవచ్చును. అన్ని మతగ్రంథములకంటే ఎక్కువ శాతము దైవజ్ఞానమున్న గ్రంథము భగవద్గీత. భగవద్గీత హిందూమతగ్రంథముగా ప్రచారము చేయబడినది. కానీ వాస్తవానికి భగవద్గీత హిందూమతగ్రంథము కాదు. ఇంకా వివరించి చెప్పితే అది ఒక మతగ్రంథమేకాదు. అన్ని మతములలోని సర్వమానవులకు