పుట:Matamu-Pathamu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుని మార్గములో ప్రయాణించువారిని దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా తయారుచేసి తన జ్ఞానమార్గములో ప్రయాణించునట్లు చేయును. అదియు ఎంత గొప్ప మేధావిగా చేయుచున్నదనగా! ప్రతి ఒక్కన్ని దేవుని మార్గములోనే ఉన్నట్లు భ్రమింపజేసి తన మార్గములో నడుపుకొనుచున్నది. ప్రత్యేకించి దేవుని జ్ఞానమును బోధించువారినే అలా చేయుచున్నది. మాయ అలా చేయడము వలన వారి బోధలను వినువారుగానీ, వారిని అనుసరించువారు గానీ, దేవుని మార్గములోనే ఉన్నామనుకొనుచూనే మాయమార్గములో ఉండి పోగలరు. మాయ మార్గమునే దేవుని మార్గముగా నమ్మియుండగలరు. ఈ విధముగా మాయ ఎక్కడ కూడ తన పేరును పైకి కనిపించకుండ చేసి తన దారిలోనే అందరిని నడుచునట్లు చేయుచున్నది. క్రైస్తవమతములో జ్ఞానులమనుకొన్న వారిని సహితము మాయ దేవుని మాటకు వ్యతిరేఖముగా తనకు అనుకూలముగా ఎలా నడుపుచున్నదో తెలియుటకు మరియొక ఉదాహరణను చూచెదము.

మత్తయి సువార్త 23వ అధ్యాయములో 9వ వచనములో ఈ విధముగ గలదు. "భూమివిూద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే విూతండ్రి, ఆయన పరలోకమందున్నాడు." ఈ మాట స్వచ్ఛముగా దేవుని కుమారుడైన ఏసుప్రభువు చెప్పిన మాట. పైకి కనిపించు ప్రభువు చెప్పినప్పటికి దానిని పూర్తి దేవుని మాటగానే లెక్కించాలి. ఎందుకనగా చెప్పినది దేవుని అంశయే కావున ఆ మాట నిజముగా దేవుని మాటయే. దేవుని విూద విశ్వాసమున్న వారు దేవుని మాటను తప్పనిసరిగా వినాలికదా! కానీ మాయ దేవుని విూద విశ్వాసమున్న వారినే ఆ మాట వినకుండ చేసినది. అదియూ మేము బోధకులము, దేవుని జ్ఞానాన్ని గురించి వివరముగా చెప్పగలము అనువారివిూదనే మాయ పట్టు సాధించి, వారిని దేవుని మార్గములోనే ఉన్నట్లు