అను పదమును వాడెడివారు. ఇందు అనగా చంద్రుడని అర్థము. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము చంద్రగ్రహము దైవజ్ఞానమునకు అధిపతి, గురుగ్రహము ప్రపంచ జ్ఞానమునకు అధిపతి. కావున ఇక్కడ దైవజ్ఞానమును ప్రత్యేకముగా గుర్తించుటకు దైవజ్ఞానమునకు అధిపతియైన చంద్రుని పేరును జ్ఞానము ముందర పెట్టారు. చంద్రున్ని ఇందు అనెడివారన్నాము కదా! జ్ఞానపథము (జ్ఞానమార్గము) లోనున్న వారిని ఇందూపథములో ఉన్నారని చెప్పెడివారు. పూర్వము ఇందూపథము అను మాటయే వాడుకలో ఉండెడిది. ఆనాటి దైవ జ్ఞానులందరిని కలిపి ఇందూపథములోని వారని అనెడివారు.
దేవుని చేతనే సృష్ఠింపబడి, దేవుని చేతనే శక్తిని పొంది, దేవుని ఆజ్ఞప్రకారము నడుచుకొను మాయకు ఇక్కడే పెద్ద ఆయుధము దొరికినది. పథము అనుమాటను మతము అనుమాటగా మార్చివేసినది. మనుషుల తలలలో తిష్టవేసిన మాయ మనుషులచేత పథమును మతముగా పలికించను మొదలుపెట్టినది. ఈ విధముగా మొదట తయారైన మతము అందరిలో వ్యాపించిపోయి ఆనాడు ఇందూపథములోని వారందరిని ఇందూమతములోని వారిగా చెప్పుకొన్నట్లు చేసినది. ఆనాడు భారతదేశమంతా దైవజ్ఞానులే ఉండెడివారు, కనుక భారతదేశమునకు ఇందూదేశమని పేరు వచ్చినది. అప్పటికాలములో ఇందూదేశములోని వారంతా ఇందూమతము వారేనని చెప్పుకొనెడివారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రపంచములో మొదటి ఇందూదేశముకానీ చివరి ఇందూదేశముగాని భారతదేశమేనని చెప్పవచ్చును. మాయకు కూడ ఇందూదేశము విూదనే ఎక్కువగా కన్నుకలదు. కావున మొదట ఇందూదేశములోనే మతము అనే ఆయుధమును ప్రయోగించినది. ఆ ఆయుధము బ్రహ్మాస్త్రమువలె పనిచేసి ఎంతటి దైవజ్ఞాని చేతనైనా మతము పేరునే చెప్పించుచున్నది. ఎంతో చాకచక్యముగా పథమును మతముగా