పుట:Matamu-Pathamu.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మార్చిన మాయ అంతటితో ఆగక మరియొక ఆయుధమును కూడ ప్రయోగించినది. అది ఏమనగా!

ఇందు అనగా చంద్రుడనీ, చంద్రుడనగానే దైవజ్ఞానమనీ తెలిసి పోతుందని, అలా దైవజ్ఞానము పేరు మతము అను పేరుకు ముందుంటే ఎప్పటికైన మతమును పథముగా ఎవరైనా మార్చినా ఇందూపథము అని తిరిగి మొదటి పేరే వస్తుంది కదా యని యోచించిన మాయ మతము ముందర ఇందూ అను పదమును తీసివేయాలనుకొన్నది. పథమును సులభముగా మతముగా మార్చిన మాయ, ఇందు అను పదము సులభముగానే హిందు అను పదముగా మార్చివేసినది. దానితో ఇందూపథము పూర్తి హిందూమతముగా మారిపోయినది. ఇందూ అనునది హిందుగా, పథము అనునది మతముగా మారిపోవడము వలన అందరూ హిందూమతమనే అనుకొంటున్నారు. ఇందూపథమునుండి హిందూ మతములోనికి మనుషులను మార్చిన మాయ, మనుషులలో దైవజ్ఞానమును లేకుండ చేసి తన జ్ఞానమును దైవజ్ఞానమువలె తలచునట్లు చేసినది. అందువలన నేడు ప్రజలలో భక్తి జ్ఞానము ఉంది అంటే అది ఎక్కువ శాతము మాయకు సంబంధించినదే అయి ఉంటుంది. హిందూమతము 98 శాతము మాయజ్ఞానములో కూరుకపోయినదని చెప్పవచ్చును. కొన్ని ఇతర మతములలో కొంతమేరకు అసలైన దైవజ్ఞానముండినప్పటికి మాయ అక్కడవారిని కూడ తనవైపు తిప్పుకొనుటకు చూస్తున్నది. అయినప్పటికి హిందూమతముకంటే ఇతర మతములే కొంత సక్రమమార్గములో ఉన్నవని చెప్పుకొనవచ్చును. ఎందుకనగా ప్రస్తుత హిందూమతము దేవుని విషయములో చాలా దిగజారిపోయినదని చెప్పుటకు ఎన్నో తార్కాణములు గలవు.