పుట:Matamu-Pathamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాయ తన జ్ఞానము మానవుల మధ్యలోనికి పంపి దేవుని జ్ఞానమును మరిచిపోవునట్లు చేయుటకు మొట్టమొదటి ఆయుధముగా మతము అను దానిని ప్రవేశపెట్టినది. మాయ మొదట మతమును ఏ విధముగా, ఎంత చాకచక్యముగా భూమివిూద ప్రవేశపెట్టినదో వివరించుకొని చూస్తాము. దేవుడు సృష్ఠి ఆదిలోనే తన జ్ఞానమును సూర్యుని ద్వారా మనుషుల మధ్యలోనికి ప్రవేశపెట్టాడు. ఏ మనిషి అయిన లేక ఏ జీవుడైన మోక్షము అను గమ్యమును చేరుటకు నేను చెప్పిన మార్గము తప్ప వేరు మార్గము లేదని తెలియజేశాడు. గమ్యమున్నదంటే దానికొక మార్గముండాలి కదా! దేవున్ని చేరుటకు, లేక మోక్షమును చేరుటకు దేవుని చేత నిర్ణయింపబడిన మార్గమే జ్ఞానమార్గము అని అంటాము. జ్ఞానమార్గమును జ్ఞానపథము అనికూడ అంటాము. పథము అనగా మార్గమనియే అర్థము. పూర్వము జ్ఞానపథము అనే మాటనే ప్రజలు ఎక్కువగా అనుకొనెడివారు. ఎవడైతే దైవజ్ఞానమును సాధించుచున్నాడో వానిని జ్ఞానపథములో ఉన్నాడని ఇతరులు చెప్పెడివారు. ఇతర మత గ్రంథములలో కూడ జ్ఞానమార్గము చాలా ఇరుకైనదనీ, మాయమార్గము చాలా విశాలమైనదని కూడ చెప్పారు. గీతలో కూడ రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయములో 23వ శ్లోకమున ఇతర దేవతలను పూజించువారు దారితప్పి నడచినవారగుదురని కూడ చెప్పాడు. దేవుడు జీవునికి గమ్యమైనపుడు ఆ గమ్యమును చేరుటకు తప్పనిసరిగ మార్గము కావాలి. ఆ మార్గమునే జ్ఞానపథము అని అనెడివారు. జ్ఞానము అను పథమును గురించి చెప్పుకొంటే జ్ఞానము రెండు రకములుగా ఉన్నది. ఒకటి దేవుని జ్ఞానము, రెండవది ప్రపంచజ్ఞానము కలవు. మార్గము లేక పథము అనునవి ఒకే అర్థము నిచ్చినప్పటికి జ్ఞానము రెండు రకములుగా ఉన్నది కావున దైవజ్ఞానమును, ప్రపంచజ్ఞానమును వేరువేరుగా గుర్తించుటకు దైవజ్ఞానమునకు "ఇందు"