పుట:Manooshakti.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

వెంటనే యాతనికా నిద్రబాధ కొంత తొలగిపోవును. ఇట్లే మరునాడుకూడను నీమనోశక్తి నాతనిపై పైనుదహరించిన విధమున నుపయోగించినయెడల నాతని నిద్రబాధ తొలగిపోవును. ఇట్టి మేలులను ప్రపంచమునందు నీవనయము జేయుచుండుటకు ప్రయత్నింపుము. అందులకై సర్వేశ్వరుడు నీకింకను గొంతశక్తినీయ నుత్సాహమును జెందుచుండును.

ఇసుకను పురుగులుగా మార్చుట.

నీవు కొంత యిసుకను దెప్పించి దానిని ప్రతివారికిని జూపింపుము. చూచినవారందరదిచూచి యిసుకని బల్కుదురు. తదనంతరము నీవా యిసుకను జూచుచు “నీకు నీటిమీద తేలగలశక్తిని నేనిచ్చుచున్నాను. నీటిమీద తేలి పురుగులాడి నట్లుగ నాడుడు” అని నీమనోశక్తి నుపయోగించి పిమ్మటా యిసుకను చెఱువునందు గాని లేక భావియందుగాని జల్లుము. పురుగులవలె ననేకచిత్రములుగ భావియం దమితముగజేరి చూచుట కసహ్యకరముగ భావినీటియందు గందరగోళమును జేయుచుండును. ఇదిచూచి ప్రతివారు మిక్కిలి వింతనొందు చుందురు. అట్టి సమయమున నీమనోశక్తిని భావియందుచూచుచు పురుగు లెక్కువయగున ట్లుపయోగించుము. చూచువారింకను మిక్కిలి యాశ్చర్యమొంద పురుగు లెక్కువగుచుండును. ఇట్టివినోదములుజేయుచు నీవేగ్రామమునకుగాని పట్టణమునకుగాని వెళ్లిన సచ్చటనే చాలమంది స్నేహితులను సంపాదింప గల్గుదువు. ఇటువంటి వింతకార్యములను నా స్నేహితుల కెల్లరకును పలుమారు చూపియుంటిని.