పుట:Manooshakti.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

దీపము నార్చుట, కాంతి తగ్గించుట.

మన గృహములయందు సామాన్యముగ నుపయోగించు దీపము నొకదానిని మనకెదురుగా మనకొక రుడుగున్నర దూరమునబెట్టించి దానివంక సరియైన దృష్టితో చూచుచు నీమనసునందిట్లను కొనుము. “నీకిక వెలుగుటకు శక్తిలేదు, వత్తిద్వారా నూనె యెక్కదు” అని నీవనుకొనినతోడనే దీపము కళాహీనమై యారిపోవుటకు సిద్ధముగ నుండును. ఇంకను నీమనోశక్తి నుపయోగించిన బొత్తిగా నారిపోవును. అట్లారిపోవుటకు ముందు నీమనోశక్తిని మరల దీపముపై కాంతిగా వెలుగుటకై యుపయోగించుము. తరువాత దీపమెప్పటివలే వెలుగుట కారంభించును.

నిద్రను బోగొట్టుట

మీగ్రామమునం దెవ్వనికైన నిద్రాదేవతబట్టి బాధించుచుండిన పాపమాతని కెన్నివిధములో నష్టములు గలుగుచుండును కాన నీవట్టివానియందు దయగలవాడవై నిద్రాదేవతబారినుండి తప్పింప ప్రయత్నింపుము. అట్లు పరపీడలను పోగొట్టుచుండిన నీకు మిక్కిలి శ్రేయస్కరము. కాన నీవతని యెదురుగా రెండడుగుల దూరమునందు గూర్చుండబెట్టము. పిమ్మట వాని కనుబొమల మధ్యజూచుచు (నీదృష్టి నుపయోగించుచు) మనోశక్తితో “నీకునిద్రాదేవతబాధతొలగిపోవును. రేపటి నుండి మావలెనే చురుకుగానుందువు. నీకీదేవత బాధవదలుటకొరకే నాకడకు తీసికొని రాబడినావు” అని యనిన