పుట:Manooshakti.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

బెణుకులను పోగొట్టుట.

నీస్నేహితులకెవరికైన చేయియో లేక మెడయో బెణికినదని వచ్చినవెంటనే యతనిని నిలుచుండ బెట్టిగాని లేక కూరుచుండబెట్టిగాని యాబెణికిన స్థలమును జూచుచు “నీకు బెణికిన స్థలమునందు బాధతగ్గిపోవును. చెదిరిననరము మరల యధాస్థానమునకు వచ్చుచున్నది” అని నీమనమునందు దృఢముగ నీచిత్తశక్తి చే తలంచిన పిమ్మట నీస్నేహితుని బాధ సులభముగ పోవును.

నామిత్రుడగు వెంపటి సూర్యనారాయణ వామనేత్రము భయంకరంబుగ నెఱ్ఱబారి నిమిషకాలమైనను పుస్తకమును చదువనియ్యకుండెను. అట్టి సనుయమున నేనాయన బాధనుజూచి నామనోశక్తిని సుమారు మూడునాలుగు నిమిషము లుపయోగించితిని. మరునాటికాయన నేత్రము యెఱుపు, వాపు, బాధ మొదలయిన వేమియు లేక శుభ్రముగా నుండి నందున సంతోషముగ నాయన నాగదికివచ్చి యాతని సంతోషమును నాయెడజూపి నన్ను మెస్మరిజమును నేర్చుకొను విధానములడిగి తెలిసికొని యాయనగూడ యభ్యాసము జేయ మొదలిడెను.

తెనాలిపురమునం దాంగ్లభాషాభ్యాసము చేయుచున్నప్పుడు నాతో నిత్యమును సుమారిరువది మందికి తక్కువయుండెడివారు కారు. వీరిలో నందరును సామాన్యముగ మెస్మరిజముచేయ నభ్యాసము ప్రతిదినమును నాతో ప్రోత్సాహమును జేయబడుచుండిరి. నేను జేయు వింతలను ప్రతిదినమును జూచుటకై