పుట:Manooshakti.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

లుచుండినయెడ నీకు కొంచెము శక్తిగలిగినట్లును లేనియెడల యింకను రెండుమూడుదినంబు లభ్యాసము (practice) చేయవలసియున్నదని యెరింగి మిక్కిలి పట్టుదలతో జేయుచుండుము. అంత నీకీమనోశక్తిబాగుగ పట్టుబడును. చీమ, దోమ మొదలగునవి నీమనోశక్రివలన యాగుచుండినతోడనే నీకు మిక్కిలి సంతోషముగల్గి పట్టుదలతో యభ్యసించుట కలవాటు పడుదువు. తత్కారణమున పెద్దశక్తిగలుగువరకును సాధనము చేయగలవాడవగుదువు. అట్టిమహాశక్తిని సంపాదించినపుడు నీకీలోకంబున గలుగు సుఖమింతని జెప్పనెవ్వరితరము.

స్నేహితుని పిలువకుండ రప్పించుట.

నీవొక స్నేహితునితో మాటలాడ నుత్సహించుచున్నావనుకొనుము. దైవవశాత్తు వాడు నీకు సమీపమందు లేడనుకొనుము. వానితో నీవట్టిసమయమున మాటలాడనెంచినయెడల నీవాతానికి పంపనెంచిన సమాచారమును మనిషి ద్వారాగాని, పోస్టుద్వారాగాని, తంతిమూలముగాగాని పంపవలయునేగాని మరియొకవిధములేదని ప్రతివారును చెప్పుదురు. కాని మనోశక్తి కలిగియుండిన యెడల నీవాతని కేవిధమైన యుత్తరము గాని తంతినిగాని, పంపకయే రప్పింపగలుగుదువు. ఎట్లన, నేకాంతముగ నేదియోయొకస్థలమునకువెళ్ళి నీస్నేహితు డేవైపుననున్నాడనితో చునో యాముఖముగ గూర్చుండి కనులనుమూసికొని యాతని యాకారమును నీమనసునందు చూచుచు "మిత్రమా నీతో" కొన్నిమాటలు మాటలాడవలసి యున్నదిగాన నాయందు దయయుంచి తప్పుక బయలుదేరి