పుట:Manooshakti.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ధ్య జూచుచు “నీకు గాఢమైన నిద్రవచ్చుగాక" అని నీమనోశక్తితో ననుము. ఇట్లనిన నిమిషకాలములోనె యాబాలుడు నిద్రబోవుట జూచి ప్రతివారును నీమనోశక్తికి మెచ్చుకొందురు. అట్టి సమయమున మనమెన్ని కేకలువేసినను నిద్రబోపుచున్న కుఱ్ఱవాడు పలుకడు. మరల నిద్రబోవుచున్న బాలునివంక జూచుచు యిదిగో సోదరులారా, యీపిల్లవానిని మీరెన్ని కేకలు వేసినను పలుకకుండెనుగదా, నేను పిలుపకుండనే లేపెదననిచెప్పి మరల నీమనోశ క్తితో- "నిద్రనుండి లేచెదపుగాక" అని నీలోనీవను కొనుము. అచ్చటనున్న వారందరాశ్చర్యమంద కుఱ్ఱవాడు నిద్రనుండి చప్పున మేల్కొనును. అప్పుడు నీవాకుఱ్ఱవానికండ్లను శుభ్రమైననీటిలో నొక తెల్లని గుడ్డనుముంచి తుడువుము. పిదప వాడెప్పటివలెనే తెలివిగల్గి యాడుకొనుటకు మొదలిడును. చూచువారు మిక్కిలి యాశ్చర్య మొందెదరు.

ఇట్టి మనోశక్తిని సంపాదించుటకై ప్రతిదినమును రెండు నిమిషములు యభ్యాసముచేయుట చాలును. ఇట్లు పది దినములైన తరువాత నీకు కొంతవరకైనను వచ్చినదా లేదాయని నీలో నీవే ప్రశ్నించుకొని పరీక్షను జేసికొనుము.

నీవొకచోట యొంటరిగ గూరుచుండి నీచుట్టుపట్ల నేదైనయొక చీమనుగాని లేక మరియొక పురుగునుగాని, పోవుచుండగజూచి నీదృష్టిని సరిగా దానియందు నిల్చి “నీకు వెశ్ళుటకు శక్తిలేదు నిలుపుము" అని నీమనసునందనుకొనినతోడనే కదలమెదలక కాళ్ళులేనిదానివలె నిలుచుండును. ఇట్లు ని