పుట:Manooshakti.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రమ్ము" అని నీమనసునందు మిక్కిలి నమ్మకముగా దలంచు చుండుము. ఇట్లు సుమారు రెండుమూడురోజులు ప్రతిదినమును ప్రాతఃకాలమున పదినిమిషములు నీమనోశక్తి నాతనిపై నుపయోగించుము. తదనంతరము నీమిత్రుడు నిన్నుజూచి మాటలాడుటకై మీగ్రామమునకు తప్పక వచ్చును. ఇదియే కొన్నిదినములు మిక్కిలి పట్టుదలతో యభ్యాసము జేయవలెను. ఇట్టి మనోశక్తిని మీగ్రామమునందున్న స్నేహితునిమీద నుపయోగించిన కొన్ని ఘంటలకాలములోనే వాడు నీవద్దకు వచ్చును.

ప్రతివారిని స్నేహితునిగా జేసికొనుట.

ఇట్లు నీకు మనోశక్తి బాగుగ సంప్రాప్తించిన తోడనే “నాకు ప్రతివారును స్నేహితులు. విరోధి యొక్కడును లేడు" అని ప్రతిదినమును నిద్రలేవగనే యనుకొనుచుండుము. నిత్య మీవిధముగ తప్పకుండగ దలంచుచుండిన లోకమునందు నిన్నుజూచినవారందరును ప్రాణమిత్రులగుదురు. ప్రతివారికిని నీయందు ప్రేమ బొడముచుండును. కొన్ని సమయములయందు నీయొక్క గొప్పనుజూచి యోర్వలేనివారుసైతము నిన్ను జూచినతోడనే వశ్యులగుదురు. కంటిరా! యిదంతయును మనోశక్తివల్లనే గలుగుచున్నది. ఇట్టి మనోశక్తివలన కొన్నికొన్ని జబ్బులనుగూడ పోగొట్టగలవాడ వగుదువు.

తలనొప్పిని పోగొట్టుట.

నీవు నీస్నేహితులతో కలసియున్నప్పుడు వారిలో నొకరికి తలనొప్పి వచ్చినదనుకొనుము. అప్పుడు వాని తలనొప్పిని