పుట:Manooshakti.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(3)

17

వేయేల, మీగ్రామమునం దెప్పుడైన యొకడు చనిపోయినయెడల వాని బంధువులందరునుజేరి ఘొల్లుమని యేడ్చుచుండగ సామాన్యముగా దారినబోవు ప్రతివారికిని దుఃఖమువచ్చుచుండుట మనము పలుమారు చూచుచునే యున్నాముగద ? కారణంబేమన, యెట్టివారివద్దనుండిన మనకు గూడ నట్టి లక్షణంబులే యలవడుననుట లోకవిదితమై యున్నది. “ఆరునెలలుసహవాసముచేసిన వారు వీరగుదు”రను లోకవాడుక ప్రతిపిల్లవానికిని కూడ తెలిసియేయున్నది. తత్కారణమున సాధ్యమైనంతవరకు మనము సత్సహవాసము మాత్రము చేయుచు దుస్సహవాసమును విసర్జించు చుండవలెను. అట్లు సత్సహవాసమును జేయుచుండిన మనకుగూడ సద్గుణములే యలవడును. గాన మనమెల్లరచే గౌరవింపబడుదుము. ఆహా ! సత్సహవాసమన నెంతటి విలువగలది ! దీనికి మించినది వేరొండులేదని ప్రతివారికిని గోచరమగుచున్నది. ఇదంతయును మనోశక్తివల్లనే కలుగుచున్నది.

నీవు మీయింటికి సమీపముననున్న యొక చిన్నిమొక్కను జూచి ప్రతిదినమా చెట్టువద్ద కొంటరిగావెళ్ళి దానికెదురుగా సుమారైదారు నిమిషముల వరకు చూచుచు నీమనసుసందు రెండవతలంపు లేకుండగ నీక్రింది విధమున తలంచు చుండుము. “నీకు పెరుగుటకు శక్తి లేదు, భూమినుండిగాని గాలినుండిగాని నీవాహారమును తీసికొనలేవు”. ఇట్లు మూడు నాలుగు దినములు నీమనోశక్తిని మొక్కపై యుపయోగించిన చూచినవారంద రాశ్చర్యముజెంద చెట్టండియుండును.