పుట:Manooshakti.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఆహా ! యేమియాశ్చర్యము ! నీవాచెట్టును ముట్టుకొనకుండగనే చంపగలుగుచున్నా వే. నీ మనోశక్తియొక్క మహిమ యింతనివణిన్ంప నెవ్వరితరము! మరియు బంగారునకు సువాసనయబ్బిన నెట్లుండునో యట్టిమాదిరీమనోశక్తికి జ్యోతి (Light)యనుకాంతిగూడ సహాయపడినయట్లుండును. యీ జ్యోతినిజూచుటకై కొంతవరకుదుర్లభమేయని చెప్పవలసివచ్చినందుదులకు కొంచెము మనస్సంకటముగ నున్నది. అయినను మిక్కిలిపట్టుదలతో సాధనము (Practice) చేసినచో సిద్ధిని పొందుట నిశ్చయమేగాని దీనిని పొందుటకు కొంతయదృష్టముకూడ నుండవలెనని కొంతమంది నాతో చెప్పుచూవచ్చిరి కాని నాయభిప్రాయమందులకు భిన్నముగానున్నది. చదువరులారా! మీకుగూడ నాకుగలిగిన యభిప్రాయమే గలిగినయెడల త్వరలో జ్యోతిని జూడగలుగుదురని నేను మిక్కిలి గట్టిగానొక్కి వక్కాణింపగలను. నీవీజ్యోతిని చూడగలిగినతోడనే యింకను మిక్కిలి విచిత్రములైన పనులెన్నియో జేయగలవాడవగుదువు.

దారినిబోవువారిని పిలువకుండగ రప్పించుట.

నీవు నీస్నేహితులతోగూడి యొక యరుగుమీద కూర్చుండిన సమయమున నొక బాటసారి ప్రక్క నున్న బజారున బోవుచుండగా జూచితివనుకొనుము. పిమ్మట నీస్నేహితులను జూచి యిదిగో చూడుడు యాబాటసారి పిలువకుండనే యిచ్చటకు రప్పించెదనని చెప్పి యాతని ముచ్చిలిగుంట మీద జూచుచున్న కొంతతడవునకు నీకొక జ్యోతి (కాంతి)