పుట:Manooshakti.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

నాడుచుండుటకు బదులు మెల్లగా పడగను మూసికొని భూమిపై బుసలుగొట్టుట మానివేసి పండుకొనును. ఇదిచూచుట కెల్లరకును వింతగనుండి నీయందేదో మహిమయున్నదని భ్రమించి ప్రతివారును నీకు స్నేహితులగుదురు ప్రపంచమున మనుజునకు గౌరవమునకన్న నెక్కువ ప్రీతికరమైనది రెండవది లేదని యెల్లరకును తెల్లంబేగదా! స్నేహితులకన్న నెక్కువగా మనకు తోడగువా రితరులు లేరనియును, మనమీ మనోశక్తిని సంపాదించిన ప్రాణస్నేహితులను పలువురను సంపాదింపగలమనియును, అట్టి ప్రాణస్నేహితు లుండుటంబట్టి మనకీప్రపంచమున నేయిక్కట్టులు గలుగవనియును ప్రతివారికిని విశదమేయైయున్నది. స్నేహితుడనగా సుఖముగానున్నప్పుడు మనయొద్దనుండి కష్టములు సంప్రాప్తించునప్పుడు మనచెంతకు రాకుండువాడుమాత్రము గాడు. కష్టసుఖములకు తోడగువాడే స్నేహితుడనబడును. విశేషంబుగ స్నేహితులతో కాలముగడుపుట సంభవించినవానిభాగ్య మేమని చెప్పవచ్చునో చదవరులే గ్రహింతురుగాక. నిత్యమును మంచిస్నేహితులతో కాలము గడపువానికి మనసునం దేకళంకమును లేక యుండును. తత్కారణమున వాడు శుక్లపక్షపు చంద్రుని మాడ్కి దినదినాభివృద్ధియై యంగబలమునందును, బుద్ధిబలము నందునుగూడ పెపొంది ప్రతివారికిని చూచుట కెల్లప్పుడును సంతోషస్వాంతుడై యుండున ట్లగుపడుటచే వానిని చూచువారు సయితము సంతోషముగా నుందురనుట వేరుగ చెప్ప వలయునా!