పుట:Manooshakti.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

దించుటకు సాధ్యపడదు. ఇట్లు సుమారిరువది లేక ముప్పది దినములు తప్పకుండగ సాధనము (practice) చేసినయెడ దృష్టిచూచుట కలవాటుపడగలవు. అలవాటు గలిగిన తోడనే నీమనోశక్తిని చాల సులభముగ నుపయోగించగలవాడ వగుదువు. కాన చిత్రంబుల నెన్నియో ప్రచురించి పలువురను నీ స్నేహితులనుగా మార్చుకొనగలవు.

ఇటువంటి శక్తిగలిగిన మనోశక్తిని యభ్యసించిన పిమ్మట, నీవునునీస్నేహితులును యొకదారిని నడచిపోవుచున్నారను కొనుడు. అప్పుడొక త్రాచుపాము గనుపడినదనుకొనుడు. స్నేహితులందరును పామునుజూచి భయమందుచున్నప్పుడు నీకీ మనోశక్తి లేకుండిన నీవుకూడ వారికన్న నెక్కువ భయమును జెంది పారిపోవుటకుగూడ ప్రయత్నము జేయుచుందువు. కాని నీకీమనోశక్తి గలిగియుండినకారణంబున భయమును జెందవలసిన యవసరము లేకపోవుటయేగాక నీస్నేహితులకు సహితము సంతోషమును గలుగజేయుదువు.

ఎట్లన, నీకు పాముకనుపించినతోడనే దానికి రెండుమూడుగజముల దూరమునకు బొమ్ము. అప్పుడా త్రాచుపాము నిన్నుజూచి పడగవిప్పి యాడుచుండును. అంత పామిట్లాడుచుండగ నీకనులను బాగుగ తెరచి అనగా నీనల్లగ్రుడ్లు కనురెప్పలకు మధ్య నిల్ఫి పాముయొక్క పడగమీద చూచుచు దృఢమనంబున “నీకు నడచుటకు శక్తిలేదు. పండుకొనుము". అని పలుకుము. అంత నీతో"నున్న స్నేహితులందరచ్చెరువంద నాపాము పడగవిప్పి బుసలుగొట్టుచు నొక్క పెట్టున