పుట:Manooshakti.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

నొకరూపాయిని భూమిమీదగాని లేక నేదైన నొక చదునైన పుస్తకముమీదగాని పెట్టి కొంతసేపు రూపాయిని నీకనులలో చూచుచు పిమ్మట దృఢ చిత్తముతో కదలిరమ్మని మనసు నందనుకొనుచున్న యొక నిమిషకాలమునకు కదలివచ్చుచుండును. కంటిరా మన మనోశ క్తివలన రూపాయి చరచర కాళ్ళుగలదానివలె మిక్కిలి వేగముగ వచ్చుచుండును. నీకును రూపాయికిని మధ్య సుమారిరువది యంగుళముల దూరమున్నప్పటికిని మధ్య నేయాధారములేక యే పరుగెత్తుకొని వచ్చు టెంతటి యాశ్చర్యకరమైన విషయము.

ఇటువంటి శక్తిని సంపాదించుటకుగాను నీవు ప్రతిదినమును తెల్లవారుజామున సుమారు నాలుగున్నరగంటల కాలమున లేచి నిత్యకృత్యములను తీర్చుకొని వీలుగానుండిన ప్రవాహజలము నందుజలకమాడి సుమారయిదున్నరగంటలు లేక ఆరుగంటల సమయమునందు కృష్ణాజినముపై నుత్తరముఖముగ గూరుచుండి యిష్టదేవతా ప్రార్థనంబొనరించి పిమ్మట నీ కెదురుగా సుమారొక యడుగుదూరమున నొక యద్దమును నీచేతులతో పట్టి యుంచి యదివరకు నీకనుబొమలమధ్య నుంచుకొనిన చాదుబొట్టును యద్దమునందు ప్రతిఫలించుదానిలో బాగుగ చూచుచుండుము. అట్లు చూచునప్పుడు నీనల్లగ్రుడ్లు రెండును నీకనురెప్పలకు మధ్యనుంచునట్లు చూచుచుండవలెను. అట్లుంచినగాని నీవీదృష్టిని సంపాదించినవాడవు కావు. తత్కారణమున చూపువిషయమై తగు జాగ్రత్తను ప్రతిదిన మును తీసికొనుచుండనియెడల త్వరలో నీమనోశక్తిని సంపా