పుట:Manooshakti.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2)

9

యుచుండిన మూడులేకనాలుగుమాసములకు సిద్ధినిపొందుట నిర్వివాదాంశము. పిమ్మటయీ మనోశక్తిచే మనమనేకకార్యములనుచేయవచ్చును యిట్లు చేయుకార్యములు మిక్కిలివింతగా గనుపించును. అందునుబట్టి ఆయాభాగములకు ప్రత్యేకపేర్లను బెట్టియున్నారు. అవన్నియును మనోశక్తివల్లనే జరుగుచున్నవి. ఈమనోశక్తిని బాగుగ సంపాదించినవారికి ప్రపంచమునందేదియును సాధ్యముగాకపోదు. గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము మొదలగునవికూడను మనోశక్తిచే సాధింపబడు చున్నవిగాని మరొకదానిచేతగాదు. మనశాస్త్రజ్ఞులు గ్రహణమెప్పుడుగల్లునదియును చెప్పుచుండుట లేదా? యిట్లు చెప్పిన దానికెన్నడైన భంగము కలుగుచున్న దా? లేదు. లేదు.

కంటిరా, యిదంతయును మనోశక్తివల్లనే గలుగుచున్నది. ఈమనోశక్తియనునది నీకగుపడుచున్నదా? లేని యెడల దీనిమహిమ నీకెట్లు తెలియుచున్నది? మనస్సునందుండివచ్చెడిశక్తి ప్రపంచమునం దెవ్వరి కనులకును గానుపించకేయున్నను, దానివలనజరుగుపనులు మాత్రము మన కెల్లరకున గానుపించును. ఎట్లనగా, చుండూరినుండి రాజమండ్రి కేదేని సమాచారము బంపవలసినయెడల చుండూరువద్దనున్న వాడు టెలిగ్రాఫ్‌యాఫీసులో నున్న యొక కడ్డీని వత్తుచుండును. ఆవత్తినప్పుడుగల్గు శబ్దము రాజమండ్రివద్ద వినబడుచుండును గాని మధ్యనున్న వారికెవ్వరికిని వినబడకయే బోవుచుండును. ఈతీగెలవల్ల నేమిజరుగుచున్నదియును తెలియక మనము చుండూరునుండి పంపినవార్త రాజమండ్రికిచేరుచున్నది.