పుట:Manooshakti.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

దూరముననున్న వా రేమిచేయుచున్నది జెప్పుటయును, తా నితరులకు వికృతాకారముగ గనుపించి భయకంపితులను జేయుటయును, తన శరీరమును మేలిమిబంగారు వన్నెవలె భ్రమింపజేయగల శక్తిని జూపించుటయును, వస్తువులయొక్క రుచులను భేదముగ జేసి చూపించుటయును, యింక మనసుచే నూహింపరాని కార్యములను జేసి జనులనందర నాశ్చర్యము గావించుటయును యీమనోశక్తియనెడు మెస్మరిజమువల్ల నే జరుగుచున్న వనుట వేరుగ జెప్ప నవసరము లేదు.

ఇట్టి మహత్తుగల్గినట్టి మనోశక్తిని పొందినయెడ దేహమును వ్యాధిబారి బడనీయకుండుటయేగాక నితరులకుగూడ సంకటములు గలుగకుండ చేయగలవాడగును. కాబట్టి అట్టి వానిని జూచిన ప్రతివారును మిక్కిలి భక్తితో గౌరవించుచుందురు. లోకమునకంతయు ప్రాణమిత్రుడై యుండును. వానియందే దేవతాస్వభావము గలదని యందరును భ్రమింతురు. పూర్వకాలంబున యోగము, తపము, మంత్రము మొదలైన వన్నియును నేర్చుకొనవలెనన్న సంసారసుఖములనువదలి వేయ వలెనని యొకవాడుకయై యున్నది. కాని ప్రస్తుతప్రపంచమున నాటినాటికి మరికొన్ని సులభ మార్గములను కనిపెట్టి యుండుటచేసన్యాసాశ్రమమునుబొందవలసినయవసరము లేనట్లగు పడుచున్నది. ఈమనోశక్తిని సంపాదించుటకు పూర్వమువలె ననేకవత్సరము లనావశ్యకము ఇట్టియభ్యాసమును జేయుటకై ప్రతిదినమును సుమారొక యరగంటకాలము చాలును. ప్రతిదినము తప్పకఒకయరగంటకాలము సాధనము (practice) చే