పుట:Manooshakti.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కంటిరా! యీవిద్యుత్ ప్రవాహము కంటికి గోచరముగాక వార్తల నెంతటి విచిత్రముగ నైదారు నిమిషములలో తీసికొనిపోవుచున్న దో! యీవిద్యుత్ ప్రవాహము తీగెద్వారా బోవుచున్నట్లెవరికైన గాన్పించుచున్నదా ? లేదు. లేదు.

అట్లే మనోశక్తి యనునదెవ్వరికిని కానుపించకపోయినను దానివలనజరుగు పనులనుమాత్రము జూడగలుగుచున్నాము. వేయేల? ప్రస్తుతకాలంబున వాయువాతన్‌లు (Wireless Telegrams) పంపుచుండుటలేదా? చెన్నపురిలోచెప్పిన సమాచారము లండనునగరములో మధ్య నేమియును గానుపించకుండగ చేరుచుండుటలేదా? యిన్నియేల, దృఢచిత్తముతో నాగుదవని యనినయెడల పోవుచున్నటువంటి పాము, చీమ, కుక్క, నక్క, మొదలయినవి యాగుచుండుట మనము పలుమారు చూచుచునే యున్నాముకదా? ఇట్లు పోవుచున్నటువంటి జంతువులనుజూచి మనస్సులో దృఢముగా యాగుదువనిన తప్పక నాగుచుండుట యెంతటి వింతయైన సంగతియైయున్నదో చదువరులే గ్రహింతురుగాక. మనోశక్తి నుపయోగించినప్పుప మనకును పామునకును మధ్యనేమియును గానుపించుట లేదుగదా? కంటిరా మనోశక్తియనున దెవ్వరికిని గానుపించకయే మనవద్దనుండిపోయి పాము నాపగలుగు చున్నది! ఇట్లే వాయు వార్తలు (Wireless Telegrams) గూడను మధ్య నెవ్వరికిని గానుపించకే చేరవలసిన స్థలమునుజేరి తనశక్తిని యొకవిధముగా జూప గలుగుచున్నది.