భారతీరాయన్న కాట్రగడ్డ : కాలానికి కూడ దుఃఖమే
నీవులేని నన్ను చూసి
దేవరాజుల దయానంద్ రావ్ : నీకంటే మృత్యువు ఎంతోనయం
వేలసార్లు వేధించి వధించదు
జానకి పాదుక : వచ్చివెళ్ళిందే తెలియలేదు
యవ్వనానికి బహుశా ఆయువు బహుతక్కువ'
'
లక్ష్మీ యలమంచిలి : అసంకల్పిత చర్యలా
కన్నుమూస్తే చాలు కలల్లో చొరబడతావ్
మాధావీ ప్రసాద్ .కె : నీకన్న అద్దమే ఎంతో నయం
నేనేడిస్తే అది ఎప్పుడూ నవ్వదు
శ్రీనివాస్ యల్లాప్రగడ : మనుషుల్ని గుర్తుపట్టాలంటే
ముందునువ్వు మనిషివైవుండాలిగా
రాజేష్ యాళ్ళ నాకు వ్యాకరణం రాదు కానీ
నీవే కర్త కర్మ క్రియ
రాంకిషన్ గొల్లపెల్లి రెండు కణాలు సంకలిస్తే జననం
ఒకక్షణం పఠీల్మని పగిలితే మరణం
సాయి కామేష్ గంటి చెత్తబుట్ట నోరుతెరిచింది
తొలి ప్రేమలేఖ రాయడం మొదలెట్టగానే
సంతోష్ కుమార్ కొత్తా వేసవి తుమ్మెద..సూరీడు
ఓపికనే తేనెని జుర్రేస్తూ
సిరి వడ్డే మరణానికైనా అడ్డుచెప్పను
మరుజన్మలోనైనా మనసిస్తానని నువ్ మాటిస్తే
శ్రీ వెంకటేష్ గ్రంథి ఆరుపలకల దేహం
తినకపోవడం వల్లకాదు తినడానికి లేకపోవడంవల్ల
శ్రీనివాస RVSS ఊహాచిత్రాలు గీస్తూనే ఉంటాను అసంఖ్యాకంగా
అస్పష్టమైన నీరూపం స్పష్టమయ్యే దాకా
సుకన్యా బీగుడెం అక్షరాల భావానికి ముద్దివ్వాలి
నీ మదిని తాకినందుకు
సురేష్ బాబు రావి ఈలోకం
9
పుట:Manimalikalu.pdf/9
ఈ పుట ఆమోదించబడ్డది