పుట:Manimalikalu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బతికున్న శవాల రంగులరాట్నం
స్వర్ణలతా నాయుడు జ్ఞాపకాల పుస్తకం తెరిచి చూసా
                                          నవ్వింది కొంటెగా నీ అల్లరిపుట
విశ్వనాథ్‌ గౌడ్‌ ఈడిగ భూమి విశాలమైనదే
                                         నాది, నీదంటూ కంచెలు వేస్తారంతే
మాధావీ అన్నాప్రగడ కాలం కాన్వాసుపై
                                         క్షణాలుగీసే చిత్రాలెన్నో

ఇవన్నీ చదివితే చుట్టూవున్న జీవితం, సమాజం, మానవ సంబంధాలు, వాటిపరిణామాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ముందుగా చెప్పుకున్నట్టు ప్రేమ, విరహం ఇత్యాదిఅంశాల గురించి రాసినవి ఎక్కువే. కొన్ని గాఢతగా వ్యక్తీకరించినవి, మరికొన్ని అలవోకతనంతో సాగినవి. ఆశ్చర్యానికి, సంభ్రమానికి గురిచేసే మణిమాలికలు కూడ లెక్కకు మించే ఉన్నాయి. సంతోషించాల్సిన విషయ మేమిటంటే, ఒకప్పటిలా కాకుండ, ఫేసుబుక్‌ పుణ్యమా అని కవిత్వరంగానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు, తమతమ స్థాయిలలో తమ భావాలను, కవిత్వ వ్యక్తీకరణగా మలిచే ప్రయత్నం చేయడం.

పదునైన , మెరుగైన ఊహాశాలిత్వం ప్రదర్శించడం . దానికి మణిమాలిక వేదిక కావడం శుభపరిణామం. సహజంగా స్పందించడం, రాయడం, జీవితాన్ని పలకడం, జీవితాన్ని చుట్టుకొనివున్న ప్రకంపనాల్ని, వేదనల్ని, సంతోషాల్ని, సందర్భాల్ని కవిత్వీకరించడం అనే పనికి పూనుకున్నందుకు ఇందులో రాసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ... జయహో!

10