పుట:Manimalikalu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వంలో ఇమాజినేషన్‌ - భావానాశక్తికి ప్రధానమైన స్థానం వుంది.
అంటే ఊహించగల శక్తి. వస్తువులను, వివిధ పరిస్థితులను, వివిధ చర్యలను ప్రతిబింబించే సామర్థ్యం. క్రమబద్ధత లేని అనుభవంలో- ఒక క్రమాన్ని చూపడమే, ఏర్పర్చడమే ఈ భావనాశక్తి అని చెప్పొచ్చు. దీన్ని సృజనాత్మకత, ఊహాశక్తి అని కూడ అనవచ్చు.

మణిమాలికలు క్లుప్తంగా సాగే ఒకానొక ప్రక్రియగా, అతిక్లుప్తతతో, భావనాశక్తితో రూపుదిద్దుకొని పాఠకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఫేస్ బుక్లో ఇదొక గ్రూపుగా, వేదికగా ప్రాచుర్యం పొందుతూ ఉండడం ఈ క్లుప్త కవిత్వప్రయోగ సఫలతను చూపిస్తుంది. మొదటి వాక్యము రెండవ వాక్యానికి సంబంధించిన పదాల నిడివిని ముందే నిర్ణయించు
కొని, ఆ పరిధిలో, చెప్ప దలచిన భావాన్ని కుదించి చెప్పడం కవి నైపుణ్యానికి సవాలే. ఆ పరిమిత చట్రంలో చెప్పదలచిన, పాఠకుడికి చేరవలసిన భావనను చేరవేయడం కూడ ఎంతో నేర్పుగా వ్యక్తీకరించడం ఒకరకంగా కత్తిమీద సామే. ఇన్ని చట్రాలను, ఇన్ని పరిమితులను అధిగమిస్తూ మణిమాలికల వేదికలో అనేకమంది రాయడం సంతోషించే
విషయం. అందులోంచి 20 మంది ఇవాళ ఈ పుస్తకరూపంలో వెలుగుచూస్తుండడం మంచి పరిణామం.

మణిమాలికలు మెరుపుల్లా, తటిల్లతల్లా ఉంటాయి. వేగవంతమైన ప్రవాహ జీవితంలో రెండుపాదాలుగా విస్తరించే భావ ప్రకటనలివి. ఒక విధంగా చూస్తే ఇవి, సెల్‌ ఫోనులో మెసేజుల్లా కనిపిస్తున్నాయి.

గతంలో ఈమణిమాలికలకు దగ్గరి పోలికలున్నవి అనేకం కనిపిస్తాయి. కొద్దితేడాతో నానీలు, నానోలు, ఫెంటోలు, ఇంకా వెనక్కువెళితే ద్విపదాలు, ధ్యానం రూపుగట్టిన హైకూలు కనిపిస్తాయి. ఐతే ఇప్పుడు ఒక విషయాన్ని పాఠకులకు అందించడానికి ఎన్నుకొనే సాధనం, లేదా సాంకేతిక క్రమంగా ఈ మణిమాలికల మాధ్యమం కనిపిస్తుంది.

ఇందులో ప్రధానంగా కనిపించే వస్తువులు-ప్రేమ, విరహం, వెన్నెల, ఎడబాటు, ప్రకృతి, కాంక్ష, వైఫల్యాలు, జీవితం మొదాలైనవి. మచ్చుకి, కొన్ని మణిమాలికలు




ప్రసాద్‌ అట్లూరి  : నేల నిద్రకి ఉపక్రమించినట్లు ఉన్నది...
                                  వెన్నెలదుప్పటి కప్పుతోంది నింగి ప్రేమతో

పద్మకుమారి వంగర  : ఏంటో పేజీలు తడిసినట్లున్నాయి
                                   నువ్వు ఏడ్చావా డైరీ