పుట:Manimalikalu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36.

రెప్పల మాటునే మేఘాలను నింపుకున్నాను

కన్నుల్ని నీకలల వర్షాలతో నింపుకోవాలని

37.

కనురెప్పలు నిదురను మరచి కాపలాకాస్తున్నాయి కలగా నువ్వు మరలి పోతున్నావనే

38.

మౌనాలేవో పెదవి విప్పుతున్నాయి మాటలు నేర్చిన కూనలమ్మలా

39.

జ్ఞాపకాల బృందావనిలో విహరిస్తున్నా మనోవేణువు ప్రణయరాగమే, ఆలపిస్తుంటే

40.

నా కనుపాపలకు పరిచయిస్తున్నా నీ చిరునవ్వుల వెన్నెలను

41.

నే ఆశల హరివిల్లునే అల్లుకుంటున్నాను చినుకువై నువ్వుfi మదిని తడిపేస్తుంటే

42.

లతలు తెగ వయ్యారాలు పోతున్నాయందుకనో ? కుసుమ కాంతలు తమను హత్తుకున్నాయనేమో !

43.

నీనవ్వుల తివాచీని పరిచావా ? పూలన్నీమూతి ముడిచాయి.!

44.

మదికి తడి తగిలేవరకు తెలియనేలేదు నీజ్ఞాపకాల బిందువులు సింధువులై తాకాయని

45.

నీనవ్వుల కాగడాను వెలిగించాను నిశీధి నీడలను పారద్రోలుదామని</poem>

మణి మాలికలు జ సిరి వడ్డే

135