పుట:Manimalikalu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

46.

 నీజ్ఞాపకాలకే నేనంటే మక్కువ
నీకంటే ఎక్కువగానే అంటిబెట్టుకున్నాయి

47.

లాకులు తెరిచినా గంగ పొంగదే ?
రైతుల కన్నుల్లో వరదలై పోటెత్తుతూ

48.

అప్పుడప్పు డూ నువ్వు నచ్చవెందుకనో?
ఎప్పుడూ నీపంతాన్నే నెగ్గించుకుంటుంటే..!

49.

దుస్తులే భారమట నవతరానికి
ఆది మానవులే నయమనిపిస్తూ

50.

భూమాతకెంత మురిపెమో
హరితాంకురాలు ...తన గుండెను చీలుస్తున్నా

51.

ఓనమాలను దిద్దడం మొదలెట్టేసాను
నీకు ప్రేమలేఖ వ్రాసేద్దామని

52.

ఎవరు గిచ్చారో? గగనాన్ని ప్రేమగా
గోరుముద్రనే నెలవంకగా... తురుముకుంది సిగపూవుగా!

53.

కంటతడి పెడుతోంది కంటిపాప, నిదురను మరచి
నను వీడిపోతున్న నానీడవైన నిను చూసి

54.

కాలమెంత గడుసరిదో కదా!
మన కోసం తానాగదు, తనతో రమ్మనీ పిలువదు

55.

నే చిరునవ్వుగా మారింది
నీ పెదవులపై కొలువుండాలనే

మణి మాలికలు జ సిరి వడ్డే