పుట:Mana-Jeevithalu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
49
సత్యాన్వేషణ

తుంది. అంటే, అనుభవంలోకి వస్తున్న దాన్ని ఫలానా అని చెప్పి, పేరుపెట్టి, తక్కిన జ్ఞాపకాలతోబాటు సుస్థిరం చేసుకోవటం, దాచుకోవటం చెయ్యకుండా ఉన్నప్పుడే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఈ నామకరణం చెయ్యటం, సుస్థిరం చెయ్యటం చైతన్యావస్థలోని వేరువేరు పొరల్లో జరిగే నిరంతర ప్రక్రియ. కాని, మనస్సు పైపైన నిశ్చలంగా ఉన్నప్పుడు లోలోపలి మనస్సు కొన్ని సూచనలను అందివ్వవచ్చు. చైతన్యావస్థ యావత్తూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏదో అవాలని ఏవిధమైన కోరికా లేకుండా స్వేచ్ఛగా ఉన్నప్పుడు, అనాలోచితంగా ఉన్నప్పుడు - అప్పుడు మాత్రమే అపరిమితమైనది ఉద్భవిస్తుంది. ఈ స్వేచ్ఛను అలాగే ఉంచుకోవాలనే కోరిక, స్వేచ్ఛగా అయిన దాని జ్ఞాపకం కొనసాగేటట్లు చేస్తుంది. దీనివల్ల సత్యానికి ఆటంకం కలుగు తుంది. సత్యం ఒకేవిధంగా కొనసాగదు. అది క్షణక్షణానికీ, ఎప్పుడు చూసినా కొత్తగా, ఎప్పుడు చూసినా స్వచ్ఛంగా ఉంటుంది. కొనసాగేది ఎన్నటికీ సృజనాత్మకం కాదు.

పైపై మనస్సు వ్యక్తపరిచేందుకున్న సాధనం మాత్రమే. అపరిమితమైన దాన్ని కొలిచే శక్తి లేదు దానికి. సత్యం గురించి చెప్పటానికి వీలుకాదు. వీలున్నట్లయితే, అది సత్యమే కాదింక.

ఇదే ధ్యానం చేయటమంటే.


19. సత్యాన్వేషణ

ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు. ఓడమీదా, విమానం మీదా వేలకొద్దీ మైళ్లు ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన తన భాషలోనే మాట్లాడాడు. ఆయన ఎన్నో కష్టాలుపడి ఈ కొత్త వాతావరణంలో సర్దుకుంటున్నాడుట. ఇటువంటి తిండికీ, వాతావరణానికీ, బొత్తిగా అలవాటు పడలేదెప్పుడూ. ఎత్తు ప్రదేశాల్లో పుట్టి పెరిగిన వాడవటం వల్ల ఈ ఉక్క భరించలేకపోతున్నాడుట. ఆయన బాగా చదువుకున్నవాడు. ఏదో శాస్త్రజ్ఞుడు. కొన్ని రచనలు కూడా చేశాడుట. ప్రాక్పశ్చిమ వేదాంతాలు రెండింటితోనూ బాగా పరిచయ ముందాయనకి. ఆయన రోమన్ కాథలిక్. చాలా కాలం నుంచి ఈ