పుట:Mana-Jeevithalu.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
48
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

గురించీ ఆలోచన రాదు. కాని, ఆలోచన మౌనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్తది రావచ్చు. కాని, దాన్ని మళ్లీ పాతదాన్నిగా, అనుభవం అయిన దానిగా చేస్తుంది ఆలోచన. ప్రతి అనుభవానికీ అనుగుణంగా తన్ను తాను రూపొందించుకొని, మార్పులు చేసుకుంటూ రంగులు మార్చుకుంటూ ఉంటుంది ఆలోచన ఎప్పుడు చూసినా, ఆలోచన చేసే పని అనుభవాన్ని వ్యక్త పరచటం మాత్రమే, అంతేకాని, అనుభవం పొందే స్థితిలో ఉండటం కాదు. అనుభవం పొందటం అయిపోగానే ఆలోచన అందుకుని ఆ అనుభవాన్ని తనకు తెలిసిన రకంగా పిలుస్తుంది. ఆలోచన తెలియని దానిలోకి దూరలేదు. అందుచేత సత్యాన్ని కనుగొనటం గాని అనుభవం పొందటం గాని దానికి చేతకాదు.

నిష్ఠలూ, నియమాలూ, త్యజించటాలూ, మమకారాలు త్రెంచుకోవటాలు, పూజలూ, సద్గుణ సాధనా - ఇవన్నీ ఎంత మహోన్నతమైన వైనా అన్నీ ఆలోచనా ప్రక్రియలే. ఆలోచన ఎప్పుడూ లక్ష్యం వైపూ, విజయసాధనకోసం మాత్రమే పనిచేయగలుగుతుంది. అవన్నీ అది ఎరిగున్నవే. సాధించిన ఘనత రక్షణ కల్పిస్తుంది - తెలిసిన దాని వల్ల వచ్చేది ఆత్మరక్షక విశ్వాసం. ఊరూపేరు లేని దానిలో రక్షణ కోసం వెతకటం వృథా. ఒకవేళ రక్షణ లభించినా, అది గతంలో తెలిసిన దాని ప్రతిరూపమే. అందువల్ల మనస్సు పూర్తిగా గాఢ నిశ్శబ్దంతో ఉండాలి. కాని ఈ నిశ్శబ్దం త్యాగంతోనూ, ఆరాధనతోనూ, అణగ త్రొక్కటంతోనూ కొనగలిగేది కాదు. మనస్సు ఇంక దేనినీ కోరకుండా ఉన్నప్పుడు, ఏదో అవాలనే ప్రక్రియలో ఇక ఏ మాత్రం చిక్కుకుని ఉండనప్పుడూ ఈ నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఈ నిశ్శబ్దం కూడబెట్టిన బాపతు కాదు. సాధన వల్ల నిర్మితమైనది కాదు. ఈ నిశ్శబ్దం కాలరహితమైన దానిలాగే మనస్సుకి తెలియనిది. మనస్సు కనుక నిశ్శబ్దాన్ని అనుభవించినట్లయితే, అది గతంలో అనుభవించిన నిశ్శబ్దాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది - ఆ గుర్తుకు తెచ్చుకునేది గత అనుభవాల ఫలితంగా ఏర్పడిన "అనుభవించేది" లేక అనుభోక్త అనేది. అనుభోక్త పొందిన అనుభవం కేవలం స్వయం కల్పితమైనది, పునశ్చరణ మాత్రమే. మనస్సు కొత్తదాన్ని ఎన్నటికీ అనుభవం పొందలేదు. అందువల్ల మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఉండాలి.

మనస్సు అనుభవం పొందే స్థితిలో లేనప్పుడే నిశ్చలంగా ఉండగలుగు