పుట:Mana-Jeevithalu.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
28
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కురిసే కుంభవృష్టి అది. చిన్నకుర్రాడొకడు ఒళ్లంతా నీటిలో నానుతూ చిన్న నీటిమడుగులో ఆడుకుంటున్నాడు, వాళ్లమ్మ కోపంతో గొంతుచించుకుని అరుస్తున్నా లెక్కచెయ్యకుండా. ఆ బురద రోడ్డు మీద మేము పైకి నడిచి వెడుతూంటే, ఒక ఆవు క్రిందికి వస్తోంది. మబ్బులు విచ్చుకుని నీళ్లన్నీ, క్రిందికి దిమ్మరిస్తున్నట్లుగా ఉంది. మేము పూర్తిగా తడిసిపోయాం. పై బట్టలన్నీ విప్పేశాం. వాన ఒంటికి తగుల్తూంటే ఎంతో బాగుంది. ఇల్లు పైన కొండవైపున ఉంది. కొండ క్రింద చిన్న పట్నం ఉంది. పడమర వైపు నుంచి బలంగా గాలి వీస్తోంది. దానితోబాటే మరింత ఉధృతమైన కారుమబ్బుల్ని వెంటబెట్టుకొస్తోంది.

గదిలో చలిమంట మండుతోంది. గదిలో చాలామంది వేచి ఉన్నారు ఎన్నో మాట్లాడాలని. వానజల్లు కిటికీల మీద కొట్టి లోపల గదిలో మడుగులా చేసింది. చిమ్నీలోంచి కూడా నీళ్లు క్రిందికి కారి, మంటలకి తగిలి చిటపట మంటున్నాయి.

ఆయన చాలా ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. వాస్తవ దృక్పథం ఉన్నవాడు. ఆయన ఎంతో మనఃపూర్వకంగానూ, హృదయపూర్వకంగానూ దేశాన్ని అభిమానించే మనిషి. సంకుచిత స్వభావంలేదు. స్వలాభాపేక్ష లేదు. ఆయన ఆకాంక్షించేది తన కోసం కాదు, అదర్శం కోసం, ప్రజల కోసం. ఊరికే బల్లగుద్ది ఉపన్యాసాలిచ్చి ఓట్లు సంపాదించేరకం కాదాయన. తన ఆదర్శంకోసం కష్టాలనుభవించాడు. అయినా చిత్రం, ఆయనేమీ విచారించటం లేదు. పండితుడులా ఉన్నాడు గాని రాజకీయవేత్తలా అంతగా లేడు. కాని, రాజకీయాలాయనకి ప్రాణం. ఆయన పార్టీకి ఆయన ఎంత చెబితే అంత - కొంత భయభక్తులతోనే. ఆయన కూడా ఎన్నో కలలు కన్నాడు. కాని వాటన్నిటిని వదిలేసుకున్నాడు రాజకీయాల కోసం. ఆయన స్నేహితుడొకాయన, ప్రముఖ ఆర్థికవేత్త. ఆయన కూడా ఈయనతో పాటు ఉన్నాడు. అపారమైన ప్రభుత్వ ఆదాయపు వివరాలూ, విపులమైన సిద్ధాంతాలూ ఆయనకి తెలుసును. వామపక్షం, దక్షిణపక్షం - ఇరుపక్షాల ఆర్థిక వేత్తలతోనూ ఆయనకు పరిచయం ఉంది. మానవాళి ఆర్ధిక విమోచన గురించి ఆయనవి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయి. సునాయాసంగా