పుట:Mana-Jeevithalu.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
29
రాజకీయాలు

మాట్లాడతాడు. మాటలకోసం తడుముకోవటం లేదు. వారిద్దరి ఉపన్యాసాలకూ జనం బాగా పోగవుతూ ఉంటారు.

దినపత్రికల్లోనూ, తక్కిన పత్రికల్లోనూ రాజకీయాలకూ, రాజకీయ వేత్తల భాషణలకూ, వారి కార్యక్రమాలకూ ఎంత చోటు కేటాయిస్తారో మీరు గమనించారా? ఇతర వార్తలు కూడా ఉంటాయి. నిజమే, కాని రాజకీయ వార్తలకే ప్రాముఖ్యం ఎక్కువ. ఆర్ధిక, రాజకీయ జీవితమే అతి ముఖ్యమై పోయింది. బాహ్య పరిస్థితులు - సుఖం, డబ్బు, హోదా, అధికారం - ఇవే ప్రధాన స్థానం ఆక్రమించి మన బ్రతుకుని తీర్చిదిద్దుతున్నాయి. పై ఆడంబరం, పేరు, వేషం, సలామూ, జండా - వీటికి ప్రాముఖ్యం ఎక్కువవుతోంది. - జీవిత పరమార్ధాన్ని పూర్తిగా మరిచి పోయారు. కావాలనే అడుక్కి తోసేశారు. సాంఘిక, రాజకీయ కార్య రంగంలో పడిపోవటం ఎంతో సులభం - జీవితాన్ని సాకల్యంగా అర్ధం చేసుకోవటం కన్న. ఏదో సిద్ధాంతంతో గాని, రాజకీయ కార్యక్రమంతోగాని, మత సంబంధమైన కార్యక్రమంతో గాని సంబంధం పెట్టుకోవటం వల్ల దైనందిన జీవితంలోని అల్పత్వం నుంచీ, ఆవేదన నుంచీ తప్పించుకోవటానికొక మార్గం లభిస్తుంది. హృదయం సంకుచితమైనదైనా, గొప్ప గొప్ప విషయాల గురించి, ప్రజాప్రియులైన నాయకుల గురించీ మాట్లాడవచ్చు. మీలోని వెలితిని ప్రపంచ వ్యవహారాల చిలుకపలుకులతో కప్పిపుచ్చుకోవచ్చును. మీ అస్తిమితమైన మనస్సు హాయిగా ఉండొచ్చును. ప్రజల ప్రోత్సాహంతో ఒక పాత మతాన్నో, కొత్త మతాన్నో ప్రచారం చేస్తూ స్థిరపడిపోవచ్చును.

ఫలితాలతో రాజీపడటమే రాజకీయాలు. మనలో చాలామంది తాపత్రయ పడేది ఫలితాల కోసమే. ఫలితాలను సాధించి శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆశిస్తాం. కాని, దురదృష్టవశాత్తూ అది అంత సులభంకాదు. జీవితం సర్వతోముఖమైన ప్రక్రియ - అంతర్ముఖమైన దానితోనూ, బహిర్ముఖమైన దానితోనూ కూడిన ప్రక్రియ. బాహ్యంగా వున్నదాన్ని ప్రభావం తప్పనిసరిగా అంతర్గతంగా ఉన్నదానిపైన ఉంటుంది. కాని అంతర్గతమైనది ఎప్పటికైనా బాహ్యంగా ఉన్నదాన్ని లోబరుచుకుంటుంది. మీ లోపల ఉన్నదే బయట పడుతుంది. బయటిదాన్నీ, లోపలిదాన్నీ విడదీసి ఒకదానితో