పుట:Mana-Jeevithalu.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
27
రాజకీయాలు

స్వార్ధాన్ని కప్పి ఉంచటం మాత్రమే. నలుగురితో కలవటం ఇబ్బంది, బాధాకరమైన విషయం. అందుచేత దురాశ లేకుండా ఉండటం అనే మాటలతో స్వార్ధపరాయణతని కప్పిపుచ్చటం జరుగుతోంది. చేతితో ఔదార్యం చూపించటం ఒకటి. హృదయంలో ఔదార్యం ఉండటం ఒకటి. చేతితో ఔదార్యం చూపించటం సులభమయిన పనే. మీకున్న సంస్కృతి, సందర్భాలను బట్టి. కాని హృదయంలో ఔదార్యం ఉండటానికి ఎంతో ప్రగాఢమైన అర్ధం ఉంది. దానికి విస్తారమైన చైతన్యం, అవగాహనా అవసరం. ఉదారంగా ఉండకపోవటం కూడా సంతోషదాయకంగానే ఉంటుంది. అది కూడా మూఢ స్వార్ధతత్పరతే. ఇది బహిరంగంగా వ్యక్తం కాదు. ఈ స్వార్ధతత్పరతతో చేసే పనులు వేరు. కలల్లో చేసేవాడి చర్యల్లాగ అవి మెలకువ తెప్పించవు. మెలకువ వస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అందుచేత చిన్నవాళ్లూ, ముసలివాళ్లూ, అందరూ ఎందుకొచ్చిన బాధ ఇదంతా, మామానాన మమ్మిల్ని వదిలేసి, గౌరవంగా బ్రతికినన్నాళ్లు బ్రతకనిచ్చి తరువాత చచ్చిపోనివ్వండి అంటారు.

హృదయ ఔదార్యం లాగే చేతి ఔదార్యం కూడా బహిరంగ కార్యక్రమమే. కాని, అది తరుచు బాధాకరంగా, వంచకంగా, స్వార్ధం బయటపడిపోయేట్లుగా ఉంటుంది. చేతితో ఔదార్యం చూపించటం సులభంగానే అలవడుతుంది. కాని హృదయ ఔదార్యం అలవరచుకుంటే వచ్చేది కాదు. కూడబెట్టటం అనేది ఎంత మాత్రం లేకుండా ఉన్నప్పుడు ఏర్పడే స్వేచ్చ అది. క్షమించాలి అంటే, మనస్సులో మానని గాయం ఏదో ఉన్నట్లే కదా. మనస్సు గాయపడింది అంటే స్వాభిమానం కూడబెట్టి ఉండటం వల్లనేకదా. "నా", "నాది" అని అనుకున్నప్పుడు హృదయంలో ఔదార్యం ఉండదు.

11. రాజకీయాలు

అటుపైన కొండల్లో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. సన్నని జల్లుగా కాదు. రోడ్లన్నీ ముంచెత్తి, కొండపక్కల ఉన్న చెట్లుపడిపోయేట్లూ, కొండరాళ్లు దొర్లి క్రింద పడేట్లూ, హోరుమంటూ కొన్ని గంటల సేపు నీరు కొట్టుకొచ్చేట్లు