పుట:Mana-Jeevithalu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభూతి, ఆనందం

303


"జీవితం మళ్లీ ఎప్పట్లా ఉంటుందా?"

నిన్నటి ఆనందం మళ్లీ ఇవాళ సంభవం అవుతుందా? ఈ రోజున ఆనందం లేనప్పుడే మళ్లీ సంభవం అవాలనే కోరిక పుడుతుంది. ఈ రోజు శూన్యంగా ఉంటే గతం వైపుగాని, భవిష్యత్తు వైపుగాని చూస్తాం. మళ్లీ సంభవం అవాలని కోరటం కొనసాగింపుకోసమే. కొనసాగేదానిలో ఎప్పుడూ కొత్తదనం ఉండదు. ఆనందం గతంలోనూ భవిష్యత్తులోనూ ఉండేది కాదు. ప్రస్తుతం జరిగే దాంట్లో మాత్రమే ఉంటుంది.

85. అనుభూతి, ఆనందం

మేము సముద్రంపైన బాగా ఎత్తులో ఉన్నాం. ఇంజన్ల చప్పుడులో గాలిగొట్టం చేసే రొదలో మాట్లాడటం కష్టమవుతోంది. అదీకాక, కొంతమంది కాలేజి కుర్రాళ్లు అ ద్వీపంలో జరగబోయే క్రీడా సమావేశానికి వెడుతున్నారు. వారిలో ఒకతని దగ్గర "బాన్జో" ఉంది. దానిమీద ఎన్నోగంటలసేపు వాయిస్తూ పాడాడు. తక్కిన వాళ్ళని పురికొల్పగా, వాళ్లంతా కలిసి పాడారు. "బాన్జో" ఉన్న కుర్రవాడి గొంతు బాగుంది. అవి "క్రూనర్లూ", "కౌబాయ్"లూ పాడేవీ, "జాజ్" సంగీతమూను. అంతా బాగా పాడారు అచ్చు గ్రామఫోను రికార్డులో లాగే. అదొక చిత్రమైన గుంపు. వాళ్లు ప్రస్తుత గురించే ఆలోచిస్తారు. ఆ క్షణంలో ఆనందించటం తప్ప వాళ్లకింకో ఆలోచన ఉండదు. రేవులో అన్నీ సమస్యలే - ఉద్యోగం, వివాహం, వృద్ధాప్యం, మరణం. కాని, ఇక్కడ సముద్రం పైన, ఎత్తున అమెరికన్ పాటలూ, సచిత్రపత్రికలూ, నల్లని మబ్బుల్లోని మెరుపునీ వాళ్లు పట్టించుకోలేదు. సముద్రంతో బాటు వంపు తిరిగిన నేలని గాని ఎండలో దూరంగా కనిపిస్తున్న ఊరుని గాని చూడలేదు వాళ్లు.

ద్వీపం ఇప్పుడు సరిగ్గా మాక్రింద ఉంది. పచ్చగా మెరుస్తోంది, వానలో ప్రక్షాళితమై. ఆకాశం మీంచి చూస్తే ప్రతిదీ ఎంత పరిశుభ్రంగానూ, తీర్చిదిద్దినట్లూ కనిపిస్తుంది! అన్నిటికన్నా ఎత్తైన కొండ అణగిపోయినట్లుగా ఉంది. తెల్లని అలల్లో చలనం లేదు. చేపలు పట్టే మట్టిరంగు పడవ ఒకటి తెరచాపలు వేసుకుని హడావిడిపడుతోంది. తుఫాను రాకముందే