పుట:Mana-Jeevithalu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చేరుకోవాలని. త్వరలోనే సురక్షితంగా చేరుకుంటుంది, రేవు దగ్గరలోనే కనిపిస్తోంది. చుట్టుతూ క్రిందికి వచ్చిన నది సముద్రంలోకి వచ్చింది - మన్నురంగూ, బంగారు వన్నే కలిసినట్లుంది. అంత ఎత్తునుంచి నదికిరు వైపులా ఏం జరుగుతుందో చూడవచ్చు. భవిష్యత్తు మరుగుపడిలేదు, మలుపు అవతల ఉన్నప్పటికీ. ఎత్తులో గతంగాని భవిష్యత్తుగాని ఉండదు. వంపు తిరిగిన స్థలం విత్తనం నాటే సమయాన్ని గాని, ఫలం అందుకునే సమయాన్ని గాని దాచి ఉంచలేదు.

పక్కసీట్లో ఉన్నాయన జీవితంలోని కష్టాలగురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. తన ఉద్యోగం గురించీ, నిత్యం ప్రయాణం చెయ్యటం గురించీ తన కుటుంబం లెక్క చెయ్యకపోవటం గురించీ, నేటి రాజకీయాల నిష్ప్రయోజనాన్ని గురించీ నిష్ఠురంగా మాట్లాడాడు. ఎక్కడికో దూరం వెడుతున్నాడు. ఇల్లు వదిలివెడుతున్నందుకు కొంత విచారిస్తున్నట్లుగా ఉన్నాడు. చెబుతున్నకొద్దీ ఆయన మరింత గంభీరంగా అయి, ప్రపంచం గురించీ, ముఖ్యంగా తన గురించీ, తన కుటుంబం గురించీ అంతకంతకు మరింత వ్యాకులపడుతున్నాడు.

"ఇదంతా వదిలేసి ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకి వెళ్లిపోవాలనీ, ఏదో కొద్దిగా పనిచేసుకుని సుఖంగా ఉండాలనీ ఉంది. నా జీవితంలో ఇంతవరకు సుఖపడ్డాననుకోను. సుఖం అంటే ఏమిటో ఎరగను. ఏదో జీవిస్తాం, పుట్టిస్తాం, పనిచేస్తాం, చచ్చిపోతాం - జంతువుల్లాగే. నాలో ఉత్సాహం అంతా పోయింది - డబ్బు సంపాదించటం తప్ప. అది కూడా విసుగెత్తిపోతోంది. నా ఉద్యోగం నేను బాగానే నిర్వహిస్తాను. మంచి జీతం సంపాదిస్తున్నా. కాని ఇదంతా ఎందుకోసమో ఏమీ అర్థం కాదు నాకు. నాకు ఆనందంగా ఉండాలని ఉంది. నేనేం చెయ్యగలను? మీ ఉద్దేశం ఏమిటి?"

అర్థం చేసుకోవటానికిది చాలా క్లిష్టమైన విషయం. గంభీర సంభాషణకిది అనువైన స్థలంకాదు.

"నా కింక మరో సమయం దొరకదని నా భయం. దిగీ దిగగానే నేను వెళ్లిపోవాలి మళ్లీ. నేను గంభీరంగా ఉన్నట్లు అనిపించకపోవచ్చు. కాని నాలో అక్కడక్కడ గంభీరమైన అంశాలు లేకపోలేదు. ఉన్న చిక్కంతా అవన్నీ