పుట:Mana-Jeevithalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజలు, మతం మార్చుకోవటం

21

మార్పు జరుగుతోంది ఎల్లవేళలా. సంస్థలూ, వాటి అధికారులూ మనుషుల్ని తమ సిద్ధాంతరీతుల్లో - మత సంబంధమైనవి గాని, ఆర్ధిక సంబంధమైనవి గాని - వాటిలో ఇరికించి, తాము వర్ధిల్లుతూ ఉంటారు. ఈ తతంగంలోనే ఉంది. ఒకరి నొకరు స్వలాభం కోసం వినియోగించుకోవటమనేది. సత్యం ఎప్పుడూ ఇటువంటి విధానాల్లోని భయాలతో, ఆశలతో సంబంధం లేకుండా ఉంటుంది. మీరు సత్యంలోని అత్యున్నత ఆనందాన్ని చవిచూడాలంటే అన్నిరకాల పూజల్నీ సిద్ధాంతరీతుల్నీ వదిలించుకోవాలి.

మత సంబంధమైన, రాజకీయ సంబంధమైన వ్యవహార రీతుల్లో మనస్సుకి రక్షణ దొరకుతుంది. అందువల్లనే సంస్థలకీ శక్తి లభిస్తోంది. సంస్థలలో ఎప్పుడూ ఆరితేరినవారూ, కొత్తగా చేరినవారూ కూడా ఉంటారు. వీరు తమ మూలధనాలతో, ఆస్తులతో ఈ సంస్థల్ని పోషిస్తూ ఉండగా, ఈ సంస్థలో లభించే అధికారం, గౌరవం - అటువంటి వాటిని సాధించటాన్నీ, ప్రాపంచిక జ్ఞానాన్నీ ఆరాధించే వారినందరినీ ఆకర్షిస్తాయి. పాతపద్ధతులు ఇంకేవిధంగానూ తృప్తికరమైనవీ, ప్రాణ ప్రదమైనవీ కావని మనసుకి తోచగానే, మరింత సుఖాన్నీ, శక్తినీ ఇచ్చే నమ్మకాలవైపుకీ, మూఢ విశ్వాసాల వైపుకీ మారిపోతుంది. అందుచేత మనస్సు చుట్టుపక్కల ఉండే వాతావరణం నుంచి తయారైనదే-ఎప్పటి కప్పుడు మళ్ళీ రూపాందించుకుంటూ, అనుభూతుల నుంచీ, ఐక్యం చేసుకోవటంనుంచీ, బలం పుంజుకుంటూ ఉంటుంది. అందువల్లనే మనస్సు నీతి నియమాలనూ, ఆలోచనా విధానాలనూ, అటువంటి వాటిని పట్టుకొని వదలదు. మనస్సు గతం నుంచి ఉద్భవిస్తున్నంతకాలం సత్యాన్ని తెలుసుకోలేదు. సత్యాన్ని బయట పడనీయదు. సంస్థల్ని పట్టుకు వ్రేలాడుతూ సత్యాన్వేషణని వదిలి పెట్టేస్తుంది.

పూజాపునస్కారాల్లో పాల్గొనేవారికి అటువంటి వాటిలో సద్భావం కలగటం సహజం. అందరితో కలిసి చేసినా, వ్యక్తిగతంగా చేసినా, పూజా పునస్కారాల్లో కొంత మనశ్శాంతి లభిస్తుంది. నిత్య కార్యకలాపాలతోనూ, దైనందిన జీవితంలోనూ పోల్చుకుంటే, పూజల్లో కొంత అందమూ, క్రమపద్ధతీ ఉన్నప్పటికీ అవి ప్రధానంగా ఉత్తేజకాలు మాత్రమే. ఉత్తేజకాలు అన్నిటిలాగే అవికూడా మనస్సునీ, హృదయాన్నీ పూర్తిగా బండబారేటట్లు చేస్తాయి.