పుట:Mana-Jeevithalu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
20
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తరువాత అక్కడున్న తెల్లవాళ్ళలోనూ, నల్లవాళ్ళలోనూ బహుకొద్ది మంది మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఎవరిత్రోవన వాళ్ళం వెళ్ళిపోయాం.

మరో భూభాగంలో ఒక దేవాలయం ఉంది. సంస్కృతంలో శ్లోకాలు గానం చేస్తున్నారు. హిందువులు చేసే పూజ జరుగుతోంది. అక్కడ చేరిన సమూహం యొక్క సంస్కృతి వేరు. సంస్కృత పదాల శబ్దం ఛేధించేట్లు చాలా శక్తిమంతంగా ఉంది. అందులో ఏదో చిత్రమైన భారం, గాంభీర్యం ఉన్నాయి.

ఒక నమ్మకం నుంచి మరొక నమ్మకానికీ, ఒక మూఢ సిద్ధాంతం నుంచి మరొక మూఢ సిద్ధాంతానికీ మారగలరు. కాని, సత్యాన్ని గ్రహించే స్థితికి మారలేరు. నమ్మకం సత్యంకాదు. మీ మనస్సుని మార్చుకోవచ్చును. మీ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చును. కాని సత్యం అనేది, దైవం అనేది నమ్మకం కాదు. అది అనుభవంలోకి రావాలి. ఏదో నమ్మకంమీద, మూఢవిశ్వాసం మీద ఆధారపడినది కాదు. మీ అనుభవం ఏదైనా నమ్మకం మీద ఆధారపడినదైతే, మీ అనుభవం మీ నమ్మకం ప్రకారమే పరిమితమై ఉంటుంది. మీకేదైనా అనుభవం హఠాత్తుగా అనాలోచితంగా జరిగి, ఆ అనుభవం మీద మరికొంత అనుభవం అయితే అటువంటి అనుభవం కేవలం కొత్తగా ఎదురైన దాన్ని గుర్తుపట్టిన పాత జ్ఞాపకం మాత్రమే. జ్ఞాపకం అనేది ఎప్పుడూ గతించిపోయినదే. జీవించి ఉన్నదాని స్పర్శతో సజీవమవుతూ ఉంటుంది.

మతం మార్చుకోవటమంటే, ఒక నమ్మకం నుంచి మరొకదానికీ, ఒక మూఢ విశ్వాసం నుంచి మరొక దానికీ, ఒక పూజమాని మరింత తృప్తినిచ్చే మరొక పూజకీ మారటమే. దీనివల్ల సత్యాన్ని కనుక్కునే మార్గం మాత్రం కనుపించదు. పైగా తృప్తి పొందటం అనేది సత్యాన్ని కనిపించనివ్వదు. అయినప్పటికీ, మతసంస్థలూ, మతసంఘాలూ చేసే ప్రయత్నం అదే. మరింత ఒప్పించో, ఒప్పించకనో ఒక సిద్ధాంతం వైపుకో, మూఢవిశ్వాసం వైపుకో, ఆశవైపుకో మిమ్మల్ని మార్చాలని చూస్తారు. అంతకన్న మంచి పంజరాన్ని ఇస్తామని ఆశచూపిస్తారు. అందులో మీకు సుఖంగా ఉండొచ్చు, ఉండక పోవచ్చు. అది మీ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా అది ఒక ఖైదు.

మతంలోనూ, రాజకీయాల్లోనూ వివిధ సాంస్కృతిక స్థాయిల్లో ఈ