పుట:Mana-Jeevithalu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మనకి! మన దగ్గర అన్ని మాటలూ, వివరణలూ ఉన్నాయి. అవి మనకి తృప్తినిస్తాయి. మాటలు అంతాన్ని వికృతం చేస్తాయి. మాట ఉండకుండా ఉన్నప్పుడే అంతం ఉంటుంది. అంతం అనేది మనకి తెలిసిన మాటలకే. మాటల్లేకుండా జరిగే అంతం, మాటలతో ప్రమేయం లేని నిశ్శబ్దం మనం ఎప్పటికీ తెలుసుకోలేము. తెలుసుకోవటమంటే జ్ఞాపకం. జ్ఞాపకం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. కోరిక అనేది ఒక రోజునీ, మరొక రోజునీ బంధించే దారం. కోరిక అంతమైతేనే కొత్తది ఉంటుంది. మరణమే కొత్తది. కొనసాగే జీవితం జ్ఞాపకం మాత్రమే అది శూన్యంగా ఉంటుంది. కొత్తదానిలో ఉండే జీవితం మరణం ఒక్కటే.

ఓ కుర్రవాడు పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నాడు, నడుస్తూ పాడుతున్నాడు. దారిపొడుగునా ఎదురైన వాళ్లందరినీ చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. చాలామంది స్నేహితులున్నట్లు కనిపిస్తోంది. ఒంటిమీద సరియైన దుస్తుల్లేవు. తలకి ఒక మాసిన గుడ్డ చుట్టుకున్నాడు. కాని ముఖం కాంతివంతంగా ఉంది. కళ్లు మెరుస్తున్నాయి. పెద్ద పెద్ద అంగల్లో, టోపీ పెట్టుకున్న ఒక లావుపాటి ఆయన దాటి వెళ్ళాడు. లావుపాటాయాన కాళ్లు ఎడంగా పెట్టి ఊగిసలాడుతూ నడుస్తున్నాడు ముఖం వ్రేలాడేసుకుని - వ్యాకుల పాటుతో, ఆదుర్దాతో. ఆ కుర్రవాడు పాడుతున్న పాటని వినలేదు. పాట పాడిన వాడివైపు ఒక్కసారి చూడనైనా లేదు. ఆ కుర్రవాడు పెద్ద గేటు మధ్యనుంచి అంగలు వేసుకుంటూ పోయి, అందమైన తోట దాటి నది మీది వంతెన దాటుకుని, వంపు తిరిగి సముద్రం వైపుకి వెళ్లాడు. అక్కడ అతని తోటివాళ్లు కలిశారు. చీకటి పడ్డంతో, వాళ్లంతా కలిసి పాడటం మొదలు పెట్టారు. ఒక కారు దీపాల వెలుగు వాళ్ల ముఖాల మీద పడింది. వాళ్ల కన్నులు ఏదో తెలియని ఆనందంతో నిండి ఉన్నాయి. ఇప్పుడు బాగా దట్టంగా వర్షం కురుస్తోంది. అన్నీ తడిసి నీళ్లు కారుతున్నాయి.

ఆయన వైద్యంలో డాక్టరే కాదు, మనస్తత్వ శాస్త్రంలో కూడా. బక్క పలచగా, ప్రశాంతంగా తృప్తిగా ఉన్న ఆయన, కొన్ని సముద్రాలు దాటి వచ్చాడు. ఈ దేశంలో చాలా కాలంపాటే ఉన్నందువల్ల ఎండకీ, పెద్ద వానలకీ