పుట:Mana-Jeevithalu.pdf/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
277
సంతృప్తి

జరిపే ఏ కార్యకలాపమైనా దుఃఖాన్నీ, వైరుధ్యాన్నీ తెస్తుంది. సంఘర్షణ అంటే ఉన్న స్థితిని కాదనటం, ఉన్నస్థితి నుంచి పారిపోవటం - అంతకన్న వేరే సంఘర్షణ ఏమీ ఉండదు. మన సంఘర్షణ అంతకంతకు మరింత గందరగోళంగా, పరిష్కారం లేకుండా ఉంటుంది - మనం ఉన్నస్థితిని ఎదుర్కోము కనుక. ఉన్నస్థితిలో ఏ గందరగోళమూ ఉండదు, దాన్ని తప్పించుకోవటానికి మనం వెతికే మార్గాల్లోనే ఉంటుంది.

80. సంతృప్తి

ఆకాశం మబ్బులతో నిండి ఉంది, పగలు వేడిగా ఉంది, ఆకులతో గాలి ఆటలాడుతున్నప్పటికీ, ఎక్కడో దూరాన ఉరిమింది. వానజల్లుకి రోడ్డుమీద దుమ్ముపడుతోంది. చిలకలు విచ్చలవిడిగా ఎగురుతున్నాయి, వాటి చిన్న తలకాయలు పగిలేటట్లు అరుస్తూ. పెద్ద డేగ ఒకటి చెట్టుపై కొమ్మమీద కూర్చుని క్రింద జరుగుతున్న ఆటని తిలకిస్తోంది. ఒక చిన్న కోతి మరో కొమ్మమీద కూచునుంది. ఆ రెండూ ఒకదానిపైన మరోటి కన్నేసి క్షేమంగా ఉండేటంత దూరంలో కూర్చున్నాయి. అంతలోనే ఒక కాకి వాటితో కలిసింది, ఉదయం దాని కాలకృత్యాలు అయిన తరవాత. ఆ డేగ కొంతసేపు నిశ్చలంగా ఉండి తరవాత ఎగిరిపోయింది. మానవమాత్రులికి మినహాయించి, అది ఒక క్రొత్తదినం. ఏదీ నిన్నటిలా లేదు. ఆ చెట్టూ, ఆ చిలకలూ అవేకాదు. గడ్డీ, పూలమొక్కలూ వేరే లక్షణంతో ఉన్నాయి. నిన్నటి జ్ఞాపకం ఈ రోజుని చీకటిగా చేస్తుంది. పోల్చటం, గ్రహించకుండా ఆటంక పరుస్తుంది. ఈ ఎరుపు, పసుపు పువ్వులు ఎంత రమణీయంగా ఉన్నాయి! రమణీయత ఒక సమయానికి చెందినది కాదు. మనం మన బరువుల్ని ఒకరోజు నుంచి మరో రోజుకి మోసుకుపోతూ ఉంటాం. ఎన్నో నిన్నల నీడ పడని రోజుండదు. మన రోజులన్నీ కొనసాగుతూ ఉండే ఒక చలనం, నిన్న ఈనాటితో, రేపటిలో కలుస్తూ, ఎప్పుడూ అంతం అంటూ ఉండదు. అంతమవుతుందంటే మనకి భయం. అంతం అవకుండా కొత్తది ఎలా ఉండగలదు? మరణం లేకపోతే జీవం ఎలా ఉండగలదు? ఆ రెండింటి గురించీ ఎంత కొంచెం తెలుసు