పుట:Mana-Jeevithalu.pdf/277

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
268
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మార్గాలూ మనకి తెలియవు. మనకి కోరిక రీతులూ, కోరికలోని పట్టుదలా తెలుసును. కాని మనకి ప్రేమ ఏమిటో తెలియదు. ప్రేమ పొగ లేని జ్వాల. మనకి పొగ బాగా తెలుసు. దానితో మన తలలూ, గుండెలూ నిండిపోతాయి. మనం చీకటిగా ఉంటాం. జ్వాల యొక్క సౌందర్యంతో మనం సరళంగా ఉండలేం. దానితో మనల్ని మనం చిత్రహింస పెట్టుకుంటాం. జ్వాలతో కలిసి, అది మనల్ని ఎక్కడికి చురుకుగా తీసుకుపోయినా, దానితో కలిసి జీవించం. మనకి మితి మిక్కిలిగా అంటే, బహుస్వల్పంగా తెలుసు. దాంతో ప్రేమపథాన్ని నిర్మిస్తాం. ప్రేమ మనకి అందకుండా మురిపిస్తుంది. మనకున్నది ఖాళీచట్రం మాత్రమే. తమకు తెలియదని తెలిసి ఉన్నవారు సరళమైన వారు. వారు ఎంతో దూరానికి పోతారు, వారికి జ్ఞానభారం ఉండదు కనుక.

ఆయన కొంతపేరు ప్రఖ్యాతులున్న సన్యాసి. కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు దూరంగా ఎటో చూస్తూ. ఆయన ఎన్నో సంవత్సరాల క్రితమే అన్నీ త్యజించానని చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంగాని, మరోలోకంగాని ఏదీ ఆసక్తి కలిగించని స్థితికి చేరుకున్నాడుట. ఆయన ఎన్నో కఠోర నియమాలను సాధన చేశాడుట. తన శ్వాసమీదా, మానసిక స్థితి మీదా అసాధారణమైన నిగ్రహం చూసేవాడుట. దీనివల్ల ఆయన కోరకపోయినా, గొప్ప శక్తీ, అనుభూతీ కలిగిందిట.

ఆకాంక్షకీ, దర్పానికీ ఉన్న శక్తి లాగే ఈ శక్తి కూడా అవగాహనకి హానికరం కాదా? దురాశ కూడా భయం లాగే శక్తివంతమైన చర్యకి కారకమవుతుంది. శక్తీ, ఆధిపత్యం అనే అనుభూతీ అంతా ఆత్మని, "నేను" అనేదాన్ని "నా" అనే దాన్ని శక్తివంతం చేస్తుంది. సత్యానికి "నేను" ప్రతిబంధకం కాదా?

"అధమంగా ఉన్నదాన్ని అణచిపెట్టటమో, లేదా ఉన్నతమైనదానికి అనుగుణంగా ఉండేట్లో చెయ్యాలి. వివిధ మనో, శారీరక వాంఛల మధ్య సంఘర్షణ లేకుండా నిశ్చలంగా చెయ్యాలి. ఇలా నిగ్రహించటంలో స్వారి చేసేవాడు శక్తిని చవిచూస్తాడు. అయితే, ఈ శక్తి మరింత ఉన్నతంగానో, మరింత ప్రగాఢంగానో పోవటానికి ఉపయోగిస్తాడు. శక్తిని స్వార్థంకోసం వినియోగిస్తే హానికరం. అంతేకాని, మహోన్నతమైనదాని కోసం మార్గాన్ని సిద్ధం చేసినందువల్లకాదు. ఇచ్ఛ అనేది శక్తి. అది ఆదేశం, వ్యక్తిగత లక్ష్యం కోసం